ఆధ్యాత్మికం

గడపకు 16 రోజులు ఇలా పూజ చేస్తే.. వివాహం జరుగుతుందా ?

సాధారణంగా మనం ఇంటి నిర్మాణం చేపట్టేటప్పుడు ఇంటికి గడపను ఎంతో పవిత్రంగా భావించి గడప క్రింది భాగంలో నవరత్నాలు, పంచలోహాలు, నవధాన్యాలను వేసి గడపను కూర్చోపెడతారు. ఈ విధంగా ఇంటికి సింహద్వారం అయినా గడపను దైవ సమానంగా భావించి నిత్యం పూజలు చేస్తాము. అందుకోసమే నిత్యం గడపకి పూజలు చేస్తూ పసుపు కుంకుమలతో అలంకరిస్తుంటారు. హిందువులు ఎంతో దైవ సమానంగా భావించే గడపను తొక్క కూడదని, గడప పై కూర్చో కూడదని పెద్దలు చెబుతుంటారు.

సాధారణంగా మనం పండుగల సమయాలలో గడపకు పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి, మామిడి తోరణాలు కట్టి, పువ్వులతో అలంకరణ చేస్తాము.ఈ విధంగా చేయడం వల్ల లక్ష్మీదేవికి మన ఇంట్లోకి వస్తుందని విశ్వసిస్తారు. ముఖ్యంగా గంటకు 16 రోజుల పాటు క్రమం తప్పకుండా పూజ చేయటం వల్ల మన ఇంట్లో వాయిదా పడిన పనులు నెరవేరుతాయి. అదే విధంగా వివాహం కాని వారికి తొందరగా వివాహం జరుగుతుంది. మరి గడపకి ఏ విధంగా పూజ చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.

do like this pooja to gadapa to get married soon

గడపకు 16 రోజులు పూజ చేసేవారు ప్రతిరోజు ఉదయం మూడు గంటలకే నిద్ర లేచి ఇంటిని శుభ్రపరచుకుని తలస్నానం చేసి గడపకు పూజ చేయాల్సి ఉంటుంది. మొదట గడపను మూడుసార్లు కడగాలి. మొదటిసారి గడపను నీటితో శుభ్రపరచాలి. రెండవ సారి పాలతో శుభ్రం చేయాలి. ఇక చివరిగా మూడవ సారి నీటితో కడగటం వల్ల గడపకు పాలతో అభిషేకం చేసినట్లు అవుతుంది. తర్వాత గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పువ్వులతో అలంకరించుకోవాలి. ఈ విధంగా అలంకరించిన తర్వాత ఒక దీపపు ప్రమిదలో ఆవు నెయ్యి వేసి మూడు వత్తులను వేసి వెలిగించాలి. అదేవిధంగా మరొక పళ్లెంలో అటుకులు, బెల్లం, తాంబూలం పెట్టి ముందుగా వినాయకుడికి పూజ చేసి తమకు మంచి సంబంధాలు దొరకాలని నమస్కరించాలి. ఈ విధానం 16 రోజుల పాటు క్రమం తప్పకుండా పూజ చేయటం వల్ల పెళ్లికాని వారికి తొందరగా పెళ్లి కుదరుతుందని పండితులు చెబుతున్నారు.

Admin

Recent Posts