ఆధ్యాత్మికం

శనివారం ఈ వస్తువులను కొంటున్నారా.. జాగ్రత్త!

మన హిందూ సాంప్రదాయాలు ప్రకారం హిందువుల ఎన్నో ఆచార వ్యవహారాలు ఎంతో విశ్వసిస్తారు. ఈ క్రమంలోనే శనివారం రోజు శనిదేవుడికి ప్రతీకగా భావించి శనీశ్వరుడికి పూజలు చేస్తుంటారు. మన పై ఎలాంటి ప్రభావం ఉన్నా.. శని దోషాలు ఉన్న వాటిని నివారణ చేసుకోవడానికి శనివారం శనీశ్వరునికి ప్రత్యేక పూజలు చేస్తాము. శని ప్రభావం మనపై పడకుండా ఉండటం కోసం మనం ఎన్ని పూజలు చేసినా శనివారం మాత్రం పొరపాటున ఈ వస్తువులను కొంటే మన ఇంటికి దరిద్రం కొనితెచ్చుకున్నట్లే అని పండితులు చెప్తున్నారు. మరి శనివారం కొనకూడని వస్తువులు ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

శనివారానికి శని దేవుడు అధిపతి కనుక శనివారం రోజు పొరపాటున కూడా ఇనుముతో తయారు చేసిన వస్తువులు ఇంటికి తెచ్చుకోకూడడు. అదేవిధంగా శనివారం ఎలాంటి కొత్త వాహనాలను కూడా కొనుగోలు చేయకూడదు. వాహనాలను కూడా ఇనుముతోనే తయారు చేసి ఉంటారు కనుక శనివారం కొత్త వాహనాలను కొనుగోలు చేయకూడదని పండితులు చెబుతున్నారు.

do not buy these items on saturday

శనివారం ఉప్పుని కూడా కొనుగోలు చేయకూడదు.ఉప్పుకి నెగిటివ్ ఎనర్జీని గ్రహించే శక్తి ఉంటుంది కనుక ఉప్పును కొనుగోలు చేయటం వల్ల మన ఇంటి పై ఆ ప్రభావం పడే అవకాశం ఉంది. ఆవనూనెను కూడా శనివారం కొనుగోలు చేయకూడదు. అలాగే కలపతో తయారు చేసిన వస్తువులు, నలుపు రంగు వస్తువులను కూడా శనివారం కొనకూడదు. అలాగే నల్లటి నువ్వులు , నువ్వుల నూనెను కూడా శని వారం ఇంటికి తెచ్చుకోకూడదని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.

Admin

Recent Posts