ఆధ్యాత్మికం

Lakshmi Devi : నువ్వులు, బెల్లంతో ఇలా చేస్తే.. ల‌క్ష్మీ దేవి క‌టాక్షం మీ వెంటే ఉంటుంది..!

Lakshmi Devi : కొందరు ఎంత కష్టపడినా ఫలితం లేకుండా పోతుంది. మరికొందరు పట్టిందల్లా బంగారమే అవుతుంది. ముఖ్యంగా గ్రహాల అనుగ్రహం లేకపోతే ఎంత కష్టపడినా అంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో కొందరికి ఎప్పుడూ దురదృష్టం వెంటాడుతూనే ఉంటుంది. అలాంటి వారు ఈ చిన్న పని చేస్తే చాలు.. ఆర్థిక కష్టాలు తొలగిపోయి ఐశ్వర్యం కలుగుతుంది. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మనం చేసే పూజలు, దానాలు, హోమాలు వంటి వాటి వలన మనకు ఉన్న దోషాలు కొంతవరకు పోయి మనం కష్టాల నుంచి కొంతవరకు బయటకు వస్తాం అనేది నమ్ముతాం. పూజ చేసేటప్పుడు భక్తి శ్రద్దలతో ఎలా చేస్తామో.. దానం చేసేటప్పుడు కూడా సరైన దానం, సరైన వారికి చెయ్యాలి. లేదంటే దాన ఫలితం లేకుండా పోతుంది. గొప్పల‌ కోసం చేసే సహాయాలు, మనకు నచ్చిన వారికి ఇచ్చే బహుమతులు లాంటివి దానాలు కావు. దానం అనేది లేని వారికి, బ్రాహ్మణులకు చెయ్యాలి. అలాగే దానాలు చేసేటప్పుడు కొన్ని మంచి రోజులు చూసుకుని, ఆ రోజు కొన్నింటిని దానం చేస్తే మంచి ఫలితం వస్తుంది.

do like this with sesame and jaggery for lakshmi devi blessings

లక్ష్మీదేవికి శుక్ర‌వారం అంటే చాలా ఇష్టం. ఈ రోజున బ్రాహ్మణులకు నువ్వులు, బెల్లం దానం ఇస్తే కోటి రెట్లు పుణ్యం వస్తుంది. అన్ని గ్రహ దోషాలు తొలగి లక్ష్మీ దేవి కటాక్షం కలుగుతుంది. ఒకవేళ బ్రాహ్మణుడికి దానం ఇవ్వలేకపోతే ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో ముందు నువ్వులు, బెల్లం ఉంచి లక్ష్మీదేవిని పూజించి మనసులో ఉన్న కోరికని కోరుకుని ఆ నువ్వులు, బెల్లంను ఆవుకి పెట్టాలి. ఇలా చేయడం వలన అన్ని దోషాలు తొలగిపోతాయి. అదృష్టం కలిసి వస్తుంది. ధ‌నం బాగా సంపాదిస్తారు. క‌నుక ల‌క్ష్మీ దేవి అనుగ్ర‌హం ల‌భించాలంటే శుక్ర‌వారం రోజు ఇలా చేయాల్సి ఉంటుంది.

Admin

Recent Posts