Ayurvedic Tips For Weight Loss : త్వరగా బరువు తగ్గాలని మీరు చూస్తున్నారా..? అయితే ఇలా చేయండి. ఈజీగా బరువు తగ్గాలనుకునే వాళ్ళకి, ఈ చిట్కాలు బాగా పనిచేస్తాయి. బరువు తగ్గాలంటే, కచ్చితంగా ఈ చిన్న చిన్న టిప్స్ మీకు బాగా ఉపయోగపడతాయి. ఈరోజుల్లో చాలామంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. అధిక బరువు సమస్య ఉన్నవాళ్లు, ఇలా చేయడం వలన సులభంగా బరువు తగ్గొచ్చు. ఆయుర్వేదం ప్రకారం, గోరు వెచ్చని నీళ్లు తాగితే ఎంతో మంచిదని చెప్పబడింది.
చల్లని నీళ్లు కంటే గోరువెచ్చని నీళ్లు తాగితే ఆరోగ్యం బాగుంటుంది. పైగా గోరువెచ్చని నీళ్లు తాగితే, బరువు తగ్గడానికి కూడా అవుతుంది. మన ఆరోగ్యం బాగుండాలి అంటే, నిద్ర కూడా ఎంతో ముఖ్యం. ఆయుర్వేదం ప్రకారం రాత్రి 10 నుండి ఉదయం 8 గంటల వరకు నిద్రపోవడానికి మంచి సమయం. తగినంత నిద్ర లేనట్లయితే, మానసిక సమస్యలు, శారీరిక సమస్యలు ఎక్కువవుతాయి.
కాబట్టి, వీలైనంత సేపు నిద్రపోవడం మంచిది. రోజు ఎనిమిది గంటల పాటు నిద్ర పోవడం మంచిది. ప్రతిరోజు రాత్రిపూట తేలికపాటి ఆహారం తీసుకోవాలి. లేదంటే జీర్ణవ్యవస్థ పై ఒత్తిడి పడుతుంది. మంచి నిద్రని కూడా పొందడానికి అవ్వదు. పైగా, బరువు సమస్య కూడా. రోజు మూడు పూట్ల కచ్చితంగా ఆహార పదార్థాలను తీసుకోవాలి. బ్రేక్ ఫాస్ట్ ని స్కిప్ చేయడం, డిన్నర్ ని స్కిప్ చేయడం వంటివి చేయకూడదు. రోజు మనం ఆహారం తీసుకున్న తర్వాత కాసేపు నడవాలి.
కనీసం 10 నిమిషాల నుండి 20 నిమిషాల వరకు, రోజు నడవడం వలన జీర్ణక్రియ రేటును పెంచుకోవచ్చు. ఆయుర్వేదం ఆహారాన్ని ఆరు భాగాలు కింద విభజించింది. తీపి, పులుపు, చేదు, ఉప్పు, వగరు, లవణం తినే ఆహారంలో ఇవన్నీ కూడా ఉండేటట్టు తప్పనిసరిగా చూసుకోవాలి. పసుపు, అల్లం, తోటకూర, త్రిఫల, ఉసిరి, దాల్చిన చెక్క వంటి వాటిలో మంచి గుణాలు ఉంటాయి. వీటిని తీసుకోవడం వలన బరువు తగ్గడానికి అవుతుంది. రోజువారి ఆహారంలో ఇలాంటివి వీలైనంత వరకు చేర్చుకోవడానికి ట్రై చేయండి. ఇలా, మీరు వీటిని తీసుకున్నట్లయితే కచ్చితంగా ఆరోగ్యము బాగుంటుంది.