ఆధ్యాత్మికం

Beeruva : బీరువా విషయంలో ఈ పొరపాట్లని అస్సలు చెయ్యకండి.. లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది..!

Beeruva : ఈరోజుల్లో డబ్బే అన్నింటికంటే ముఖ్యమైనదిగా మారిపోయింది. కొన్ని కొన్ని సార్లు డబ్బులు లేకపోతే బంధాలు కూడా ఉండడం లేదు. డబ్బులు ఉన్నప్పుడే బంధువులు కూడా వస్తూ ఉంటారు. డబ్బు లేకపోతే బంధువులు కూడా మనకి దూరం అవుతారు. మనిషి జీవితంలో ప్రేమ, అనుబంధాల తర్వాత డబ్బు ముఖ్యపాత్ర పోషిస్తుంది. అయితే కొందరు మాత్రం డబ్బు సంపాదించడానికి ఎన్నో రకాల కష్టాలు పడుతూ ఉంటారు. ఎంత కష్టపడినా కూడా డబ్బులు చేతికి రావు. పైగా డబ్బులు చేతికి వచ్చినా త్వరగా ఖర్చయిపోవడం, లేదంటే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవడం ఇలా ఏదో ఒకటి జరుగుతుంది.

ఆర్థిక సమస్యల నుండి గట్టెక్కడానికి కష్టపడి పని చేయడంతోపాటు వీటిని పాటిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. డబ్బు మీ ఇంట ఉంటుంది. మనం డబ్బులు దాచే బీరువాకి పొరపాటున అద్దం ఉంటే ఆర్థిక కష్టాలు ఎక్కువవుతాయి. సాధారణ బీరువాకి అద్దం ఉన్నప్పుడు మనం వెళ్లి అద్దం ముందు నిలబడి తయారవుతూ ఉంటాము. బీరువాలో సాక్షాత్తు అమ్మవారి స్వరూపమైన బంగారం, డబ్బుల‌ని పెడుతూ ఉంటాము. బయట అద్దం ముందు మనం తయారయ్యి నిలబడినప్పుడు, అమ్మవారికి కోపం వచ్చి, ఇంటి నుండి వెళ్ళిపోతుందని వాస్తు పండితులు అంటున్నారు.

do not do these mistakes in beeruva

కాబట్టి ఈ పొరపాటు లేకుండా చూసుకోండి. చీపురుతో ఇంటిని ఊడ్చేటప్పుడు బీరువా చుట్టూ ఊడ్చ‌కూడదు. కేవలం తడిగుడ్డ‌తో మాత్రమే బీరువా చుట్టుపక్కల తుడుచుకోవాలి. బీరువాలో పాత వస్తువులు, పాడైపోయిన వస్తువులు పెట్టకూడదు. పనికిరాని వాటిని బీరువాకి దూరంగా ఉంచుకోవాలి. బీరువాలో 6 పసుపు కొమ్ములు, 6 లక్ష్మీ గవ్వలు పెడితే అదృష్టం కలుగుతుంది. పచ్చ కర్పూరాన్ని కూడా పెట్టుకోవడం మంచిది.

బీరువా తలుపులు తెరిచి, తలుపులు వేయడం మర్చిపోతే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. బీరువాకి యజమాని కాళ్లు తగిలితే అదృష్ట లక్ష్మి అనుగ్రహం పోతుంది. స్నానం చేయకుండా బీరువాని తెరవకూడదు. అలా చేయడం వలన ధన లాభం పొందే యోగం తగ్గిపోతుంది. చూశారు కదా వేటిని పాటించాలి వేటిని పాటించకూడదని.. మరి ఇలా అనుసరించి ఆర్థిక బాధల నుండి బయటపడండి.

Admin

Recent Posts