lifestyle

సూర్యుడు అస్త‌మించే స‌మ‌యంలో ఎట్టి ప‌రిస్థితిలోనూ ఈ ప‌నుల‌ను చేయ‌కండి.. చేస్తే అంతే సంగ‌తులు..

సాధార‌ణంగా మ‌నం రోజూ అనేక ర‌కాల ప‌నుల‌ను చేస్తుంటాం. కొన్ని ప‌నుల‌ను మ‌నం తెలిసే చేస్తాం. కొన్ని ప‌నుల‌ను చేయ‌డం వ‌ల్ల అదృష్టం క‌ల‌సి వ‌స్తుంది. అయితే కొన్ని ప‌నుల‌ను మాత్రం తెలియ‌కుండానే చేస్తుంటాం. దీంతో అశుభం క‌లుగుతుంది. ఫ‌లితంగా అన్నీ స‌మ‌స్య‌లే వ‌స్తుంటాయి. ఎవ‌రైనా స‌రే డ‌బ్బు సంపాదించాల‌ని.. సుఖంగా జీవించాల‌ని.. ఆ డ‌బ్బు ఎక్కువ కాలం ఉండాల‌ని.. సంతోషంగా జీవితం గ‌డ‌పాల‌ని కోరుకుంటారు. కానీ అనేక ర‌కాల స‌మ‌స్య‌లు మ‌న‌ల్ని చుట్టు ముడుతుంటాయి. అయితే కొన్ని ర‌కాల ప‌నుల‌ను మ‌నం రోజూ చేస్తూనే ఉంటాం. కానీ వాటిని చేస్తే అశుభం జ‌రుగుతుంద‌ని.. అన్నీ స‌మస్య‌లే వ‌స్తాయ‌ని పండితులు చెబుతున్నారు.

ఇక కొన్ని ర‌కాల ప‌నుల‌ను మ‌నం రోజు మొత్తం మీద చేసినా.. సాయంత్రం సంధ్యా స‌మ‌యంలో మాత్రం కొన్ని ప‌నులను ఎట్టి ప‌రిస్థితిలోనూ చేయ‌రాదు. చేస్తే అరిష్టం క‌లుగుతుంది. అన్ని విధాలుగా స‌మ‌స్య‌లే వ‌స్తాయి. ముఖ్యంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర‌వుతాయి. ఇక సూర్యాస్త‌మ‌యం స‌మ‌యంలో చేయ‌కూడ‌ని ఆ ప‌నులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

do not do these works when sun is set

సూర్యాస్త‌మ‌యం స‌మ‌యంలో కొన్ని ర‌కాల ప‌నుల‌ను మ‌నం ఎట్టి ప‌రిస్థితిలోనూ చేయ‌రాదు. అవేమిటంటే.. తుల‌సి ఆకుల‌ను సాయంత్రం స‌మ‌యంలో అస‌లు కోయ‌రాదు. అంతేకాదు.. ఆ మొక్క‌ను కూడా తాక‌రాదు. అలా చేస్తే ల‌క్ష్మీదేవికి కోపం వ‌స్తుంద‌ట‌. దీంతో డ‌బ్బు చేతిలో నిల‌వ‌దు. ఆర్థిక స‌మ‌స్య‌లు వ‌స్తాయి. అలాగే సాయంత్రం స‌మ‌యంలో చీపురును వాడ‌రాదు. సాయంత్రం క‌న్నా ముందే చీపురును ఉప‌యోగించాలి. సూర్యాస్త‌మ‌యం స‌మ‌యంలో చీపురును ఉప‌యోగిస్తే ఇంట్లో ల‌క్ష్మీదేవి ఉండ‌ద‌ని చెబుతున్నారు.

ఇక సాయంత్రం స‌మ‌యంలో ఇత‌రులు ఎవరికీ కూడా పాలు, పెరుగు, చ‌క్కెర వంటి తెల్ల‌ని ప‌దార్థాల‌ను ఇవ్వ‌కూడ‌దు. అలాగే సాయంత్రం స‌మ‌యంలో చెత్త‌ను బ‌య‌ట వేయ‌రాదు. ఎవ‌రికీ అప్పులు ఇవ్వ‌రాదు. ఇస్తే వెన‌క్కి రావు. అలాగే సాయంత్రం స‌మ‌యంలో గోర్ల‌ను, శిరోజాల‌ను క‌ట్ చేయ‌రాదు. ఇలా కొన్ని ప‌నుల‌ను మ‌నం సూర్యుడు అస్త‌మించే స‌మ‌యంలో చేయ‌కూడ‌దు. చేస్తే అన్నీ స‌మ‌స్య‌లే వ‌స్తాయ‌న్న విష‌యాన్ని గుర్తుంచుకోవాలి.

Admin

Recent Posts