ఆధ్యాత్మికం

Lord Kubera : మీరు స్నానం చేసే నీటిలో వీటిని క‌లిపి చేయండి.. మీకు కుబేరుడి ఆశీస్సులు లభించి ధ‌న‌వంతులు అవుతారు..!

Lord Kubera : ల‌క్ష్మీ దేవితో పాటు కుబేరుడి ఆశీస్సులు కూడా పొందాల‌ని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటారు. ల‌క్ష్మీదేవితో పాటు కుబేరుడిని కూడా సంప‌ద‌కు దేవుడిగా ప‌రిగ‌ణిస్తారు. కుబేరుడి ఆశీస్సులు ఉంటే మ‌నం ఆర్థిక స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సిన అవ‌స‌రం లేదు. కుబేరుడిని ప్ర‌స‌న్నం చేసుకోవ‌డం వ‌ల్ల ఆర్థిక స‌మ‌స్య‌లు తీర‌తాయి. మ‌నం ఆర్థికంగా బ‌లంగా త‌యార‌వుతాము. అదే విధంగా ఒక‌వేళ కుబేరుడి ఆగ్ర‌హానికి గురైతే మ‌నం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండాల‌న్నా, కుబేరుడి అనుగ్ర‌హం మ‌న మీద ఉండాల‌న్నా మ‌నం స్నానం చేసే నీటిలో వీటిని వేసుకోవాల‌ని జోతిష్య శాస్త్రం చెబుతుంది. నీటిలో ఈ ప్ర‌త్యేక‌మైన వాటిని వేసుకుని స్నానం చేయ‌డం వ‌ల్ల కుబేరుడి అనుగ్ర‌హం ఎప్పుడూ మ‌న మీద ఉంటుంద‌ని ఆర్థికంగా బ‌లంగా త‌యార‌వుతామ‌ని పండితులు చెబుతున్నారు.

స్నానం చేసే నీటిలో వేటిని వేసుకోవ‌డం వ‌ల్ల మ‌నం కుబేరుడి అనుగ్ర‌హాన్ని పొంద‌గలుగుతామో.. ఇప్పుడు తెలుసుకుందాం. జోతిష్య శాస్త్రం ప్ర‌కారం స్నానం చేసే నీటిలో ఉప్పును వేసుకోవాలి. వారానికి రెండు రోజులు స్నానం చేసే నీటిలో ఉప్పు వేసుకుని స్నానం చేయడం వ‌ల్ల ప్ర‌తికూల శ‌క్తులు తొల‌గిపోతాయి. మంగ‌ళ‌వారం, శ‌నివారాల్లో స్నానం చేసుకునే నీటిలో ఉప్పు వేసుకుని చేయ‌డం వ‌ల్ల ల‌క్ష్మీ దేవితో పాటు కుబేరుడి ఆశీస్సులు కూడా ఉంటాయి. ఇలా 6 నెల‌ల పాటు చేయ‌డం వ‌ల్ల మ‌నం సానుకూల ఫ‌లితాల‌ను చూడ‌వ‌చ్చు. అలాగే సోమ‌వారం నాడు నీటిలోమ పాలు క‌లిపి స్నానం చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల మాన‌సిక ప్ర‌శాంత‌త ల‌భిస్తుంది. ఇళ్లు ఎప్పుడూ సంప‌ద‌ల‌తో క‌ళ‌క‌ళ‌లాడుతూ ఉంటుంది. అంతేకాకుండా అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా న‌యం అవుతాయి. ఇక శుక్ర‌వారం నాడు నీటిలో ఏదైనా ప‌రిమ‌ళాన్ని క‌లిపి స్నానం చేయాలి.

mix this and bath for lord kubera blessings

ఇలా చేయ‌డం వ‌ల్ల కుబేరుడి ద‌య వ‌ల్ల జీవితంలో పురోగ‌తి వ‌స్తుంది. సంప‌ద‌ల‌కు లోటు లేకుండా ఉంటుంది. అలాగే గురువారం నీటిలో ప‌సుపు క‌లిపి స్నానం చేయ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితాల‌ను చూడ‌వ‌చ్చ‌ని జోతిష్య శాస్త్రం చెబుతుంది. ఇలా చేయ‌డం వ‌ల్ల జాత‌కంలో గ‌రు గ్ర‌హం బ‌ల‌ప‌డుతుంది. ఇలా 3 నెల‌ల పాటు చేయ‌డం వ‌ల్ల సంప‌ద పెర‌గ‌డం ప్రారంభ‌మ‌వుతుంది. అలాగే శ‌నివారం నాడు నీటిలో ఉప్పు మ‌రియు ప‌సుపు క‌లిపి స్నానం చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల కుబేరుడి ఆశీస్సులు ఎల్ల‌ప్పుడూ మ‌న‌పై ఉంటాయి. డ‌బ్బుకు లోటు లేకుండా ఉంటుంది. ఆర్థిక ప‌రిస్థితి మెరుగుప‌డుతుంది.

Admin

Recent Posts