vastu

Bed Room Items : వాస్తు ప్ర‌కారం బెడ్‌రూమ్‌లో ఈ వ‌స్తువుల‌ను అస‌లు పెట్ట‌కండి.. లేదంటే అన్నీ స‌మ‌స్య‌లే..!

Bed Room Items : ప్రతి ఒక్కరు కూడా, వాస్తు ప్రకారం నడుచుకుంటూ ఉంటారు. వాస్తు ప్రకారం నడుచుకుంటే అంతా మంచి జరుగుతుంది. వాస్తు ప్రకారం, పడకగదిలో ఈ వస్తువులని అస్సలు పెట్టకూడదు. వీటిని కనుక పెట్టినట్లయితే, చెడు జరుగుతుంది. ఎప్పుడూ కూడా వాస్తు ప్రకారం బెడ్ రూమ్ లో వీటిని పెట్టకండి. వీటిని కనుక మీరు బెడ్ రూమ్ లో పెట్టినట్లయితే, అనవసరంగా ఇబ్బందుల్లో పడాల్సి ఉంటుంది. బెడ్రూంలో అసలు టీవీ, కంప్యూటర్, స్మార్ట్ ఫోన్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలని పెట్టకూడదు. ఎలక్ట్రానిక్ రేడియేషన్ వలన నిద్రకి భంగం కలుగుతుంది. దీంతో ఆరోగ్యం పై ప్రభావం పడుతుంది.

పడకగదిలో నిద్ర పోవడానికి ఒక గంట ముందు వీటన్నిటిని ఆఫ్ చేయాలి. ఎలక్ట్రానిక్ వస్తువులను వలన, నిద్రకి భంగం కలుగుతుందని గుర్తు పెట్టుకోండి. అలానే, పడకగదిలో పదునైన ఆయుధాలని పెట్టకూడదు. కత్తులు, కత్తెర్లు వంటి పదునైన వాటిని బెడ్ రూమ్ లో పెడితే, నెగటివ్ ఎనర్జీ కలుగుతుంది. బెడ్రూంలో వీటిని ఉంచడం వలన, దంపతులు మధ్య గొడవలు వస్తాయి. పడక గదిలో అద్దం ఉండడం మంచిది కాదు. బెడ్ రూమ్ ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి.

do not put these items in bedroom as per vastu

ఒకవేళ కనుక బెడ్ రూమ్లో అద్దం ఉంటే, పడుకునే ముందు దానిని కవర్ చూసేయండి. మంచానికి దూరంగా ఉంటే పర్వాలేదు. మంచానికి ఎదురుగా అస్సలు ఉండకూడదు. మంచానికి ఎదురుగా అద్దం ఉంటే, దంపతుల మధ్య గొడవలు వస్తాయి. ఇవే కాకుండా బెడ్రూంలో బిల్లులు వంటివి పెట్టకూడదు.

బెడ్రూంలో ఒత్తిడి కలిగించే వాటిని పెట్టకండి. బిల్లులు వంటి వాటిని బెడ్ రూమ్లో పెట్టడం వలన నెగటివ్ ఎనర్జీ కలుగుతుంది. ప్రశాంతత ఉండదు. విశ్రాంతిని తీసుకోలేక పోతారు. పడకగది ఎప్పుడు కూడా శుభ్రంగా ఉండాలి. నిద్రకి భంగం కలిగించే వస్తువులు కూడా పడక గదిలో ఉండకూడదు. ఈ తప్పులు జరగకుండా చూసుకోండి లేదంటే, అనవసరంగా ఇబ్బంది పడాలి. బెడ్రూంలో వీటిని తొలగిస్తే బాగుంటుంది. అప్పుడు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. సంతోషంగా ఉండొచ్చు.

Admin

Recent Posts