ఆధ్యాత్మికం

Lakshmi Devi Photo : ల‌క్ష్మీదేవి ఫొటోను ఇంట్లో పెట్టే విష‌యంలో ఈ త‌ప్పుల‌ను చేయ‌కండి..!

Lakshmi Devi Photo : వాస్తు శాస్త్రం ప్ర‌కారం ఇంటిని నిర్మిస్తేనే మ‌న‌కు ఎలాంటి దోషాలు రాకుండా ఉంటాయి. దీంతో ఇంట్లో ఉండే అందరికీ ఏ స‌మ‌స్య‌లు రావు. ముఖ్యంగా ఆరోగ్య‌, ఆర్థిక స‌మ‌స్య‌లు రాకుండా చూసుకోవ‌చ్చు. అయితే ఎంత వాస్తు ప్ర‌కారం ఇంటిని నిర్మించిన‌ప్ప‌టికీ ఇంట్లో కొంద‌రు వాస్తు ప్ర‌కారం కొన్ని త‌ప్పులు చేస్తుంటారు. ముఖ్యంగా కొన్ని ర‌కాల వ‌స్తువుల‌ను వాస్తు ప్ర‌కారం ఉంచ‌కూడ‌ని చోట ఉంచుతారు. దీంతో వాస్తు దోషం ఏర్ప‌డుతుంది. ఫ‌లితంగా అన్ని విధాలుగా స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. ఇక దేవుళ్లు, దేవ‌త‌ల ఫొటోలు లేదా విగ్ర‌హాల‌ను కూడా వాస్తు ప్ర‌కార‌మే ఉంచాలి. లేదంటే దోషం ఏర్ప‌డుతుంది.

ముఖ్యంగా ల‌క్ష్మీదేవి చిత్ర ప‌టాన్ని ఇంట్లో పెట్టుకున్న‌ప్పుడు వాస్తు నియ‌మాల‌ను పాటించాలి. లేదంటే దోషం ఏర్ప‌డి డ‌బ్బు ల‌భించ‌క‌పోగా మ‌న‌కు అన్నీ ఆర్థిక స‌మ‌స్య‌లే వ‌స్తాయి. డ‌బ్బు సంపాదించినా చేతిలో నిల‌వ‌దు. ఇక ల‌క్ష్మీదేవి చిత్ర పటాన్ని ఇంట్లో ఏ విధంగా పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం. ల‌క్ష్మీదేవి చిత్ర‌ప‌టాన్ని ఇంట్లో ఈశాన్య దిశ‌లో పెడితే చాలా మంచిది. లేదా ఉత్త‌రం వైపున కూడా పెట్ట‌వ‌చ్చు. అయితే పూజా మందిరం ఉన్న‌వారు అందులో లక్ష్మీదేవి చిత్ర ప‌టాన్ని ఉంచ‌వ‌చ్చు.

do not make these mistakes while putting lakshmi devi photo

ఇక మీరు ఇంట్లో ల‌క్ష్మీదేవి చిత్ర ప‌టాన్ని పెడితే అందులో ఏనుగు ఉండేట్లు చూసుకోండి. కానీ ల‌క్ష్మీదేవి నిల‌బ‌డి ఉన్న విధంగా ఉన్న ఫొటోను మాత్రం ఇంట్లో పెట్ట‌వ‌ద్దు. ఇలాంటి ఫొటోల‌ను కేవ‌లం షాపుల్లో, ఆఫీసుల్లో మాత్ర‌మే పెట్టాలి. ఇంట్లో ల‌క్ష్మీదేవి కూర్చున్న‌ట్లు ఉన్న ఫొటోల‌ను మాత్ర‌మే పెట్టాలి. ఆమె వెనుక ఏనుగులు క‌నక వ‌ర్షం కురిపిస్తున్న‌ట్లుగా ఉండే ఫొటో అయితే మంచిది.

ఇలా ల‌క్ష్మీదేవి ఫొటోను గ‌నుక మీరు ఇంట్లో పెట్టుకున్న‌ట్లయితే ఆమె అనుగ్ర‌హం మీకు వెంట‌నే ల‌భిస్తుంది. దీంతో మీకు ఉండే ఆర్థిక స‌మ‌స్య‌లు పోతాయి. మీకు గ‌న‌క వ‌చ్చిన డ‌బ్బు చేతిలో నిల‌వ‌కుండా అలాగే ఖ‌ర్చ‌యిపోతుంటే ఈ ప‌రిహారం ద్వారా మీరు డ‌బ్బును పొదుపు చేయ‌వ‌చ్చు. అలాగే ఎలాంటి సంపాద‌న లేని వారికి కొత్త ఆదాయ మార్గాలు వ‌స్తాయి. క‌నుక ఇంట్లో ల‌క్ష్మీదేవి చిత్ర ప‌టాన్ని పెట్టే విషయంలో ప్ర‌తి ఒక్క‌రు ఈ జాగ్ర‌త్త‌ల‌ను పాటించాల్సి ఉంటుంది.

Admin

Recent Posts