ఆధ్యాత్మికం

శుక్రవారం ఆయా దేవుళ్లు, దేవతలకు ఇలా పూజలు చేయండి.. అష్టైశ్వరాలు కలిగి కష్టాలు పోతాయి..

శుక్రవారం పూట ఇంట్లో శ్రీ మహాలక్ష్మి దేవిని పూజిస్తే.. అనుకున్న కార్యాలు నెరవేరుతాయి. శుక్రవారం ఉదయాన్నే తలస్నానం చేసి పసుపు లేదా ఎరుపు లేదా ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించి ఇంట్లో పూజాది కార్యక్రమాలను పూర్తి చేసి అమ్మవారి ఆలయంలో అమ్మవారిని దర్శించుకోవాలి. అక్కడ నేతితో దీపం వెలిగించాలి. దీంతో మహిళలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తం చేకూరుతుంది.

శుక్రవారం విఘ్నేశ్వరుడి ఆలయానికి వెళితే గరికమాల తీసుకువెళ్లాలి. గరికమాలను వినాయకుడికి ప్రతి శుక్రవారం సమర్పిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. శుక్రవారం శివాలయానికి వెళ్లేవారు బిల్వ పత్రాలను తీసుకెళ్లడం వల్ల కష్టాలు తొలగిపోయి, సర్వ శుభాలు కలుగుతాయి.

do pooja to lakshmi devi on friday like this to get rid of problems

విష్ణుమూర్తి ఆలయాన్ని శుక్రవారం సందర్శించుకోవాలనుకుంటే తులసి మాల సమర్పించాలి. ఆంజనేయ స్వామిని దర్శించుకునేవారు వెన్న ముద్దతో వెళ్లడం వల్ల వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. దుర్గమ్మను శుక్రవారం దర్శించుకునే మహిళలు పసుపు, తెలుపు, ఎరుపు రంగు పూలను సమర్పించుకుంటే ఈతి బాధలు తొలగిపోయి సుఖ సంతోషాలతోపాటు అష్టైశ్వరాలు పొందుతారని పురాణాలు చెబుతున్నాయి.

శుక్రవారాల్లో చేసే ఈ పూజల ద్వారా అష్టైశ్వరాలు సిద్ధించడంతోపాటు కష్టాలు తొలగిపోతాయి. అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. అంతా శుభమే జరుగుతుంది. ధనం కలసి వస్తుంది.

Admin

Recent Posts