హెల్త్ టిప్స్

Mother And Child : బిడ్డ జన్మించిన అనంతరం తల్లులు తప్పనిసరిగా తీసుకోవాల్సిన అతి ముఖ్యమైన జాగ్రత్తలు..!

Mother And Child : తల్లి కావాలని ప్రతి మహిళ కోరుకుంటుంది. దీన్ని అనేక మంది మహిళలు అదృష్టంగా కూడా భావిస్తారు. ఇక తమ కల నెరవేరి నిజంగా గర్భం దాల్చితే ఆ ఆనందానికి హద్దులు ఉండవు. ఈ క్రమంలోనే గర్భంతో ఉన్న మహిళలు పుట్టబోయే తమ బిడ్డ ఆరోగ్యం పట్ల అమితమైన శ్రద్ధ వహిస్తారు. అయితే గర్భంతో ఉన్నప్పుడే కాదు, బిడ్డకు జన్మనిచ్చిన తరువాత, వారు పాలు మరిచేంత వరకు తల్లులు కొన్ని జాగ్రత్తలను తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

బిడ్డ పుట్టిన తరువాత తల్లులు తప్పనిసరిగా జాగ్రత్త వహించాల్సిన వాటిలో తల్లిపాలు కూడా ఒకటి. ఈ విషయంలో తల్లులతోపాటు తండ్రులు కూడా వైద్యుల సలహాను తప్పనిసరిగా తీసుకోవాలి. డాక్టర్ సూచనల మేరకు తల్లిపాలను క్రమం తప్పకుండా అందించాలి. గర్భంతో ఉన్నప్పుడు ఎలాగైతే విటమిన్లు, మినరల్ ట్యాబ్లెట్లు తీసుకుంటారో అదే విధంగా బిడ్డ జన్మించిన తరువాత కూడా కొనసాగించాలి. డాక్టర్ చెప్పేంత వరకు లేదా బిడ్డ పాలు మరిచేంత వరకు ఈ ట్యాబ్లెట్లను తీసుకోవడం మానకూడదు. బిడ్డ జన్మించిన తరువాత సాధారణంగా తల్లులు ఎక్కువ ఒత్తిడి, అలసటకు లోనవుతుంటారు. ఇలాంటి సమయంలో ఇతరుల సహాయం తీసుకోవాలి.

mothers after delivery must take these precautions and health tips

డెలివరీ అనంతరం తల్లి ఎల్లప్పుడూ బిడ్డతో ఉంటుంది. ఈ సమయంలో టెన్షన్, ఆందోళనకు గురి చేసే హార్మోన్లు ఎక్కువగా విడుదలవుతూ ఉంటాయి. వీటిని విడుదల చేసే గ్రంథులు కిడ్నీలపై ఉంటాయి. ఇవి కార్టిసాల్ అనే హార్మోన్‌ను ఎక్కువగా విడుదల చేస్తాయి. దీంతో తల్లుల్లో సహజంగానే తమ బిడ్డ పట్ల ఆందోళన ఏర్పడుతుంది. తగినంత విశ్రాంతి తీసుకోవడం లేదా ఇతరుల సహాయం తీసుకుంటే దీని నుంచి బయట పడవచ్చు. గర్భధారణ అనంతరం బిడ్డ డెలివరీ అయ్యే వరకు తీసుకున్న పౌష్టికాహారాన్ని బిడ్డ జన్మించిన అనంతరం కూడా కొనసాగించాలి. ఎందుకంటే పాలిచ్చే తల్లుల ద్వారా ఆ పౌష్టికాహారంలోని పోషకాలు బిడ్డకు లభిస్తాయి. కాబట్టి బిడ్డ పాలు మరిచేంత వరకు పౌష్టికాహారం తీసుకోవడం మానకూడదు.

డెలివరీ అనంతరం బిడ్డ సంరక్షణ సమయంలో ఒత్తిడి మరీ ఎక్కువగా ఉంటే డిప్రెషన్‌కు లోనయ్యే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో అవసరమైతే మానసిక వైద్యుల వద్దకు వెళ్లాలి. దీంతో సమస్యను పరిష్కరించుకునేందుకు అవకాశం ఉంటుంది.

Admin

Recent Posts