ఆధ్యాత్మికం

Lord Hanuman : పువ్వుల క‌న్నా ఆకుల‌తో చేసే పూజ అంటేనే హ‌నుమ‌కు ఇష్టం.. క‌నుక ఈసారి ఇలా చేయండి..!

Lord Hanuman : చాలామంది ఆంజనేయ స్వామిని ప్రత్యేకించి పూజిస్తూ ఉంటారు. ఆంజనేయస్వామికి పూజ చేయడం వలన ఆంజనేయ స్వామి అనుగ్రహం మనకి కలుగుతుంది. అయితే హనుమంతుడిని పూజించేటప్పుడు పూలతో కంటే ఆకులకి ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. ఆకు పూజకి అధిక ప్రాధాన్యత ఇస్తాడు హనుమంతుడు అని పండితులు అంటుంటారు. హనుమంతుడికి ఆకు పూజలు చేయడం వలన గండాలు, ఆర్థిక బాధలు వంటివి తొలగిపోతాయి. ఈతి బాధలు వంటివి కూడా కలగవు.

హనుమంతుడు ఆకు పూజని బాగా ఇష్టపడతాడు. హనుమంతుడు లంకా నగరానికి వెళ్లి సీతమ్మ వారి జాడను తెలుసుకుంటాడు. ఆమెకు ధైర్యాన్ని కూడా చెబుతాడు. లంకా నగర వాసులకి భయాన్ని చెప్తాడు. ఆ తర్వాత అక్కడి నుండి రాముడిని కలుసుకుని సీతను చూసిన విషయాన్ని హనుమంతుడు చెప్తాడు. సంతోషంతో రాముడు తమలపాకును తెంపి మాలాగా చేసి, ఆయన మెడలో వేస్తాడు. ఆయనని అభినందిస్తాడు.

do pooja to lord hanuman with leaves for luck and wealth

అయితే లంకా నగరాన్ని ఆంజనేయ స్వామి తోకతో తగలబెట్టి వస్తాడు. అందుకని ఆయన శరీరం వేడిగా ఉండడంతో, తాపాన్ని తగ్గించడం కోసమే రాముడు మెడలో తమలపాకు మాలని హనుమంతుడికి వేసినట్టు పురాణాల ద్వారా తెలుసుకోవ‌చ్చు. అలా హనుమంతుడి మెడలో రాములవారు తమలపాకుల‌ మాల వేయడం వలన హనుమంతుడు ఒక్కసారిగా ఆయన పడిన శ్రమనంతా కూడా మరిచిపోతాడు. ఎంతో సంతోషంతో ఉంటాడు.

ఇలా రాములవారు హనుమంతుడి మెడలో తమలపాకు మాలని వేయడం వలన ఆయన ఎంతో సంతోషపడ‌తాడు. కనుక ఆంజనేయస్వామిని సంతోషంగా ఉంచడానికి అప్పటి నుండి కూడా తమలపాకు మాలని వేయడం జరుగుతోంది. తమలపాకులతో పూజ చేస్తే హనుమంతుడు మనకి వరాలని ఇస్తాడు. తమలపాకులతో పూజ చేస్తే కోరుకున్నవి జరుగుతాయని పండితులు అంటున్నారు. అందుకని ప్రత్యేకించి హనుమంతుడిని తమలపాకులతో పూజిస్తారు. హనుమంతుడి అనుగ్రహం కలగాలంటే కచ్చితంగా ఇలా తమలపాకుల‌తో పూజించడం మంచిది.

Admin

Recent Posts