హెల్త్ టిప్స్

పసుపు టీ తాగితే అనేక లాభాలు.. ఎలా త‌యారు చేయాలంటే..?

భార‌తీయులంద‌రి ఇళ్ల‌లోనూ ప‌సుపు ఉంటుంది. దీన్ని వంటి ఇంటి ప‌దార్థంగా ఉప‌యోగిస్తారు. అయితే ప‌సుపులో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉంటాయి. దీంతో త‌యారు చేసే టీని రోజూ తాగ‌డం వ‌ల్ల అనేక లాభాలు క‌లుగుతాయి.

ఒక పాత్ర‌లో 4 క‌ప్పుల నీళ్లు పోసి 2 టీస్పూన్ల ప‌సుపు వేయాలి. అనంత‌రం 10 నిమిషాల పాటు బాగా మ‌రిగించాలి. త‌రువాత దాన్ని వ‌డ‌క‌ట్టి అందులో తేనె, కొబ్బ‌రినూనె క‌లుపుకుని తాగాలి. దీంతో అనేక లాభాలు క‌లుగుతాయి.

turmeric tea many wonderful health benefits

1. ప‌సుపు టీ తాగ‌డం వ‌ల్ల రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.

2. అధిక బ‌రువుతో బాధ‌ప‌డుతున్న వారు ప‌సుపు టీని తాగితే త్వ‌ర‌గా బ‌రువు త‌గ్గుతారు.

3. పసుపు టీ తాగ‌డం వ‌ల్ల లివ‌ర్ ఆరోగ్యం మెరుగు ప‌డుతుంది.

4. కొలెస్ట్రాల్ ఎక్కువ‌గా ఉన్న‌వారు ప‌సుపు టీ తాగితే ఆ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

5. ఆర్థ‌రైటిస్ నొప్పులు ఉన్న‌వారు ప‌సుపు టీని తాగితే నొప్పులు త‌గ్గుతాయి.

Admin

Recent Posts