Nagarjuna : బిగ్ బాస్ ఓటీటీ తెలుగుకు నాగార్జున అందుకుంటున్న రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా ?

Nagarjuna : బుల్లితెర‌పై మోస్ట్ స‌క్సెస్‌ఫుల్ షోగా బిగ్ బాస్ ఎంతో పేరు గాంచింది. ఈ క్ర‌మంలోనే తాజాగా బిగ్ బాస్ ఓటీటీని కూడా ప్రారంభించారు. ఇందులో 17 మంది కంటెస్టెంట్లు పాల్గొంటున్నారు. 84 రోజుల పాటు షో కొన‌సాగ‌నుంది. అయితే టీవీలో ఇప్పటి వ‌ర‌కు 5 సీజ‌న్ల‌ను పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు ఓటీటీలో ప్ర‌సారం అవుతోంది. అందులో భాగంగానే టీవీ షోల‌కు హోస్ట్‌గా ఉన్న నాగార్జున ఇప్పుడు ఓటీటీ షోకు కూడా హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

do you know about Nagarjuna remuneration for Bigg Boss OTT Telugu
Nagarjuna

ఇక ఈసారి షోలో అషూ రెడ్డి, మ‌హేష్ విట్టా, ముమైత్ ఖాన్‌, అజ‌య్‌, యాంకర్‌ స్రవంతి, ఆర్జే చైతూ, అరియానా, న‌ట‌రాజ్ మాస్ట‌ర్‌, శ్రీరాపాక, మోడల్‌ అనిల్‌ రాథోడ్‌, నటి మిత్ర శర్మ, తేజస్వీ, సరయు, యాంక‌ర్ శివ‌, హీరోయిన్‌ బిందు మాధవి, హ‌మీదా, అఖిల్‌ సార్థక్ త‌దిత‌రులు కంటెస్టెంట్లుగా ప్ర‌వేశించారు. ఈ షో ఓటీటీలో 24 గంట‌లూ ప్ర‌సారం అవుతోంది.

కాగా 84 రోజుల పాటు కొన‌సాగ‌నున్న ఈ షోకు నాగార్జున భారీ మొత్తంలో రెమ్యున‌రేష‌న్ అందుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. 12 వారాల‌కు క‌లిపి రూ.8 నుంచి రూ.9 కోట్ల‌ను ఆయ‌న రెమ్యున‌రేష‌న్‌గా అందుకోనున్న‌ట్లు టాక్ వినిపిస్తోంది. అంటే రూ.9 కోట్లు అనుకుంటే.. వారానికి 2 ఎపిసోడ్స్ చొప్పున 24 ఎపిసోడ్లు ఉంటాయి. ఒక్కో ఎపిసోడ్‌కు రూ.37.50 ల‌క్ష‌లను ఆయ‌న రెమ్యున‌రేష‌న్ గా అందుకోనున్నార‌న్న‌మాట‌. ఈ మేర‌కు సోష‌ల్ మీడియాలో వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

Editor

Recent Posts