వినోదం

SS Rajamouli : రాజ‌మౌళి కెరీర్‌లో ఒకే ఒక్క ఫ్లాప్ ఉంది.. అది ఏ సినిమానో తెలుసా..?

SS Rajamouli : ద‌ర్శ‌కధీరుడు రాజ‌మౌళి స్టూడెంట్ నెం 1 చిత్రంతో మెగా ఫోన్ ప‌ట్టుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా సూప‌ర్ హిట్ కావ‌డంతో అదే ఉత్సాహంతో సినిమాలు చేస్తూ వెళ్లారు. ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ‘స్టూడెంట్ నంబ‌ర్ వ‌న్’ సినిమా రాజమౌళికి మొదటి సినిమా అయిన కూడా 4 కోట్ల‌కు ఈ చిత్రాన్ని అమ్మారు. ఈ చిత్రం 11.3 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక మ‌గ‌ధీర‌, ఈగ‌, బాహుబలి లాంటి సినిమాల‌తో విజువ‌ల్ వండ‌ర్స్ ను సృష్టించిన జ‌క్క‌న్న ఎవ‌రికి అంద‌నంత ఎత్తుకు ఎదిగారు. భారతీయ సినీ తెర పై ఒక కళాఖండం వచ్చింది అంటే కారణం… రాజమౌళి. అందుకే రాజమౌళిని చూసి ఇండియన్ సినిమా గర్విస్తోంది.

ద‌ర్శ‌కుడిగా ఓట‌మి అనేది ఎరుగ‌కుండా వ‌రుస సినిమాలు చేస్తున్న రాజ‌మౌళికి తన కెరీర్‌లో ఓ సినిమా అట్ట‌ర్ ఫ్లాప్‌గా నిలిచింది. అయితే న‌టుడిగా ఆ సినిమా దారుణ‌మైన నిరాశ‌ను మిగిల్చింది. రాజ‌మౌళి . నాని హీరోగా చేసిన మ‌జ్ను సినిమాలో కూడా కనిపించారు. ఈ సినిమా తో పాటూ వీఎన్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన రైన్ బో సినిమాలో కూడా ముఖ్య పాత్ర పోషించారు. ఈ సినిమా అట్ట‌ర్ ఫ్లాప్ గా నిలిచింది. ఎలాంటి ఫ్లాప్స్ లేని రాజ‌మౌళికి ఈ చిత్రం మాత్రం పెద్ద నిరాశ‌ని క‌లిగించింద‌నే చెప్పాలి.

do you know that rajamouli acted movies were flop

రాజ‌మౌళి ద‌ర్శ‌కుడిగా ఇప్ప‌టి వ‌ర‌కు 12 సినిమాలు తెర‌కెక్కించ‌గా, ప్ర‌తి చిత్రం కూడా సూప‌ర్ హిట్. బాహుబ‌లి బిగినింగ్ చిత్రాన్ని 138 కోట్లతో నిర్మించారు. ఇక 191 కోట్ల‌కు ఈ సినిమాని అమ్మారు. అయితే, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 302 కోట్ల‌ను కలెక్ట్ చేసింది.బాహుబలి కంక్లూజ‌న్ చిత్రాన్ని రూ.250 కోట్ల‌తో నిర్మించారు. అయితే, ఈ చిత్రం 1617 కోట్ల‌ను కలెక్ట్ చేసింది. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాని రూ.350 కోట్ల‌తో నిర్మించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద రూ.1200 కోట్లను వ‌సూలు చేసింది.

Admin

Recent Posts