Nivetha Pethuraj : న‌టి నివేతా పేతురాజ్ కు చెందిన ఈ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు తెలుసా..?

Nivetha Pethuraj : టాలీవుడ్‌లో న‌టిగా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపును సొంతం చేసుకున్న నివేతా పేతురాజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈమె ప‌లు సినిమాల్లో హీరోయిన్‌గా న‌టించినా అవి పెద్ద‌గా హిట్ కాలేదు. కానీ పెద్ద చిత్రాల్లో చిన్న చిన్న పాత్ర‌లు చేస్తూ కెరీర్‌ను విజ‌య‌వంతంగానే కొన‌సాగిస్తోంది. ఇక ఈమె సోష‌ల్ మీడియాలోనూ ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గానే ఉంటుంది.

do you know these interesting things about Nivetha Pethuraj
Nivetha Pethuraj

నివేతా పేతురాజ్ 2015లో మిస్ ఇండియా యూఏఈ పేజంట్ అవార్డును గెలుచుకుంది. ఈమె సినిమాల్లోకి రాక ముందు ప్ర‌ముఖ మోడ‌ల్‌గా ఉండేది. ప‌లు బ్రాండ్ల‌కు గాను యాడ్స్ కూడా చేసింది. అలాగే ఈమెకు పుస్త‌కాల‌ను చ‌ద‌వ‌డం, తోట‌ప‌ని, పెయింటింగ్‌, సంగీతం విన‌డం అంటే చాలా ఇష్టం.

గ‌తంలో ఒక‌సారి ఈమెకు చెందిన మార్ఫింగ్ ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో కొంద‌రు వైర‌ల్ చేశారు. దీంతో అప్ప‌ట్లో ఈమె పోలీస్ కంప్లెయింట్ కూడా ఇచ్చింది. 2017లో త‌మిళ సినిమా మెంట‌ల్ మ‌దిలోకు గాను ఈమెకు బెస్ట్ ఫ్రెష్ ఫేస్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వ‌చ్చింది. సినిమాల్లోకి రాక‌ముందు ఈమె దుబాయ్‌లో మోడ‌ల్‌గా ప‌నిచేసింది.

నివేతా పేతురాజ్‌లో ఉన్న మ‌రో టాలెంట్ ఏమిటంటే.. ఈమె ఒక బాక్స‌ర్‌. అందులో శిక్ష‌ణ కూడా పొందింది. అలాగే రెజ్లింగ్ కూడా చేస్తుంది. 2016లో ఒరు నాల్ కోతు అనే త‌మిళ సినిమా ద్వారా ఈమె వెండితెర‌కు ప‌రిచ‌యం అయింది. అది హిట్ కావ‌డంతో ఇక ఈమె వెనుదిరిగి చూడ‌లేదు.

Editor

Recent Posts