Sarkaru Vaari Paata : స‌ర్కారు వారి పాట మొద‌టి సాంగ్ క‌ళావతి వ‌చ్చేసింది.. పాట అదిరిపోయిందిగా..!

Sarkaru Vaari Paata : ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వంలో సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు హీరోగా, కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టించిన చిత్రం.. స‌ర్కారు వారి పాట‌. ఈ మూవీ లోంచి మొద‌టి సాంగ్‌ను కొంత సేప‌టి క్రిత‌మే లాంచ్ చేశారు. క‌ళావ‌తి అనే పాట‌ను వీడియో సాంగ్ రూపంలో ఆవిష్క‌రించారు. వాస్త‌వానికి ఈ పాట‌ను వాలెంటైన్స్ డే సంద‌ర్భంగా ప్ర‌త్యేకంగా విడుద‌ల చేద్దామ‌ని చిత్ర యూనిట్ భావించింది. కానీ ఈ పాట‌ను చిత్ర యూనిట్‌లోని కొంద‌రు లీక్ చేశారు. దీంతో ఈ పాట‌ను విడుద‌ల చేయ‌క త‌ప్ప‌లేదు.

Sarkaru Vaari Paata Kalaavathi video song out now
Sarkaru Vaari Paata

ఇక ఈ మూవీకి థ‌మ‌న్ సంగీతం అందించారు. క‌ళావ‌తి పాటను పూర్తిగా క్లాసిక‌ల్ నేప‌థ్యంలో చిత్రీక‌రించారు. ఈ పాట‌ను విడుద‌ల చేసి కొంత సేపే అవుతోంది. అయిన‌ప్ప‌టికీ యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ పాట‌ను అనంత శ్రీ‌రామ్ ర‌చించ‌గా.. సిద్ శ్రీ‌రామ్ గాత్రం అందించారు.

స‌ర్కారు వారి పాట చిత్రాన్ని జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, మైత్రి మూవీ మేక‌ర్స్, 14 రీల్స్ ప్ల‌స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో స‌ముద్ర‌ఖ‌ని, సుబ్బ‌రాజు, వెన్నెల కిషోర్ లు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ మూవీని మే 12వ తేదీన విడుద‌ల చేయ‌నున్నారు.

Editor

Recent Posts