వినోదం

Chanti Movie : చంటి లాంటి హిట్ మూవీని మిస్ చేసుకున్న హీరో ఎవ‌రో తెలుసా..?

Chanti Movie : సినిమా రంగంలోకి న‌టుల వార‌సులు ఎంతో మంది వ‌చ్చారు. కానీ వారిలో కేవ‌లం కొంద‌రు మాత్రం త‌మ టాలెంట్‌తో నిల‌దొక్కుకున్నారు. చాలా కాలం నుంచి అలా వారు ఇండ‌స్ట్రీలో కొన‌సాగుతున్నారు. అలాంటి వారిలో న‌టుడు వెంక‌టేష్ ఒక‌రు. విక్ట‌రీని ఆయ‌న ఇంటి పేరుగా మార్చుకున్నారు. చేసిన తొలి సినిమాతోనే ఘ‌న విజ‌యం సాధించారు. ఇక వెంక‌టేష్ త‌న కెరీర్‌లో ఎన్నో వైవిధ్య‌భ‌రిత‌మైన చిత్రాల్లో న‌టించారు. వాటిల్లో చంటి ఒక‌టి. ఈ మూవీలో వెంకీ అమాయ‌కుడి పాత్ర‌లో క‌నిపించి ఆక‌ట్టుకున్నారు.

వెంకటేష్, మీనా కాంబినేషన్ లో రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన చంటి సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా విడుదలై దాదాపుగా 30 సంవత్సరాలు అయింది. ఈ సినిమాలో వెంకటేష్, మీనా అద్భుతంగా నటించారు. ఈ సినిమా తమిళంలో హిట్టయిన చిన్న తంబీ సినిమాకు రీమేక్. చంటి సినిమాలో వెంకటేష్ అమాయకమైన పల్లెటూరి యువకుని పాత్రలో నటించారు. ఈ సినిమాలో మొదటగా హీరోగా రాజేంద్ర ప్రసాద్ ని అనుకున్నారట. ఆ సమయంలోనే చిన్న తంబి సినిమాను రామానాయుడు చూశారట.

do you know who missed to do chanti movie

ఈ సినిమా రీమేక్ రైట్స్ ను కేఎస్ రామారావు కొనుగోలు చేశారు. ఈ సినిమాలో హీరోగా చేయటానికి రాజేంద్ర ప్రసాద్ ని ఒప్పించారట. ఈ సినిమా వెంకటేష్, సురేష్ బాబుకు కూడా బాగా నచ్చడంతో కె.ఎస్.రామారావు.. రవిరాజా పినిశెట్టిని వెంకటేష్ ని హీరోగా పెట్టి చేయమని చెప్పారట. అయితే రవిరాజా పినిశెట్టి రాజేంద్ర ప్రసాద్ కి మాట ఇచ్చాను చేస్తే ఆ హీరో తోనే చేస్తాను అని పట్టుబట్టారు అట. అప్పుడు చిరంజీవి రవిరాజా పినిశెట్టిని ఒప్పించటంతో వెంకీ మీనాలతో ఈ సినిమా తెరకెక్కింది. అలా రాజేంద్ర ప్ర‌సాద్ ఈ మూవీలో న‌టించ‌లేదు. కానీ ఆయన చేసి ఉంటే కెరీర్ మ‌రోలా ఉండేది.

Admin

Recent Posts