ఆధ్యాత్మికం

ఇంట్లో ఎవ‌రైనా చ‌నిపోతే ఇంటిని విడిచిపెట్టాలా.. ఇంట్లో ప్రేతాత్మ‌లు తిరుగుతాయా..?

ఇంట్లో వ్య‌క్తి ఎవ‌రైనా మ‌ర‌ణిస్తే ఇళ్లు వ‌దిలి పెట్టాల‌ని, శాంతిపూజ‌లు చేయాల‌ని పండితులు చెబుతూ ఉంటారు. అయితే చాలా మంది వీటిని న‌మ్మాలా వ‌ద్దా అని సంశ‌యిస్తూ ఉంటారు. కొద్ద‌రు పండితులు చెపినట్టు ఇళ్లు వ‌దిలి పెడ‌తారు. కొంద‌రు ఏం కాదులే అని అదే ఇంట్లో ఉంటూ ఉంటారు. అస‌లు ఇంట్లో వ్య‌క్తి మ‌ర‌ణిస్తే పూజ‌లు చేయాలా వ‌ద్దా, ఇళ్లు వ‌ద‌లాలా వ‌ద్దా శాస్త్రం ఏం చెబుతుంది.. దీని గురించి పండితులు ఏమంటున్నారు అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. వ్య‌క్తి మ‌రణించిన స‌మ‌యాన్ని బ‌ట్టి ఇళ్లు వ‌దిలి పెట్టాల వ‌ద్దా అనేది ఉంటుంద‌ని పండితులు చెబుతున్నారు. వ్య‌క్తి మ‌ర‌ణించిన స‌మ‌యంలో న‌క్ష‌త్రాల‌ను బ‌ట్టి ఇంటిని 3 నుండి 6 నెల‌ల వ‌ర‌కు వ‌దిలి పెట్టాల‌ని పండితులు చెబుతున్నారు.

అలాగే మంగ‌ళ‌వారం క‌నుక మ‌ర‌ణిస్తే ఖ‌చ్చితంగా శాంతి పూజ‌లు చేయాల‌ని వారు చెబుతున్నారు. మంగ‌ళ వారం తిరుగును కోరుతుంది. ఒక‌వేళ శాంతి పూజ‌లు క‌నుక చేయ‌క‌పోతే ఆ ఇంట్లో మ‌రో వ్య‌క్తి మ‌ర‌ణించే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయ‌ని పండితులు చెబుతున్నారు. అలాగే చాలా మంది వ్య‌క్తి మ‌ర‌ణించిన త‌రువాత సంవ‌త్స‌రం వ‌ర‌కు ఇంట్లో దీపారాధాన కానీ, దాన ధ‌ర్మాలు కానీ. అలాగే దైవ‌ద‌ర్శ‌నం కానీ చేయ‌రు. కానీ వ్య‌క్తి మ‌ర‌ణించిన తరువాత పెద్ద క‌ర్మ జ‌రిగిన త‌రువాత ఇంట్లో పూజ‌లు త‌ప్ప‌కుండా చేయాల‌ని పండితులు చెబుతున్నారు. ఒకవేళ పూజ‌లు, దైవ సంబంధిత కార్య క్ర‌మాలు క‌నుక చేయ‌క‌పోతే ఇంట్లో భూతాలు, పిశాచాలు, ప్రేతాలు ఇంట్లోకి వ‌చ్చి ఆవ‌హిస్తాయ‌ని పండితులు చెబుతున్నారు.

shall we leave the house if anybody dies

దీంతో ఇంట్లో వ్య‌క్తుల మ‌ధ్య గొడవ‌లు జ‌రిగే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. ఒక‌రి మీద ఒక‌రికి గౌర‌వ మ‌ర్యాద‌లు త‌గ్గిపోతాయి. ఇంట్లో ఉన్న వ్య‌క్తులు వారి ఇష్టం వ‌చ్చినట్టు న‌డుచుకుంటారు. ఇంట్లో స‌మ‌స్య‌ల త‌లెత్త‌డం, అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌డం వంటివి జ‌రుగుతాయని పండితులు తెలియ‌జేస్తున్నారు. వ్య‌క్తి చ‌నిపోయిన‌ప్ప‌టికి పెద్ద క‌ర్మ జ‌రిగిన మ‌రుస‌టి రోజు నుండి ఇంట్లో దీపం వెలిగించ‌వ‌చ్చ‌ని ఇంట్లోని ఎవ‌రైనా వెలిగించవ‌చ్చ‌ని పండితులు చెబుతున్నారు.

Admin

Recent Posts