ఆధ్యాత్మికం

Navagraha : ఈ త‌ప్పులు చేస్తే న‌వగ్ర‌హ దోషాలు ఏర్ప‌డుతాయి జాగ్ర‌త్త‌..!

Navagraha : గ్రహదోషానికి సంబంధించిన విషయాలు చాలా మందికి తెలియవు. గ్రహ దోషాలకి కారణాలు, వాటి పరిష్కారాల గురించి ఈరోజు తెలుసుకుందాం. శుక్రవారం నాడు కానీ శనివారం నాడు కానీ ఏడిస్తే, గ్రహదోషాల ప్రభావం బాగా పెరుగుతుంది. వారం యొక్క ముఖ్యదేవతని పూజించకపోతే గ్రహదోషాల ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. అలానే ఆలయంలో నవగ్రహాలు ఉంటాయి కదా.. వాటిని కనుక పూజించకుండా మీరు వెళ్తే, గ్రహ దోషాల ప్రభావం బాగా పెరుగుతుంది.

గురువారం నాడు గురువుకి పూజ చేయడం వలన మానవుడి యొక్క గ్రహదోషాలు శాంతిస్తాయి. సూర్యభగవానుడుని ఆరాధిస్తే సమస్యలు తొలగిపోతాయి. ఉదయించే సూర్యుడిని దర్శించుకోవాలి. సూర్య నమస్కారాలు చేయకపోతే, గ్రహాలు వ్యతిరేకంగా ప్రవర్తిస్తాయి అని గుర్తుపెట్టుకోండి. జన్మదినం రోజున ఎలాంటి దానం చేయకుండా ఉంటే, శని గ్రహ పీడలు మిమ్మల్ని వేధిస్తాయి.

doing these mistakes can create navagraha dosha

సోమవారం నాడు శివాభిషేకం చేయకపోతే, ఇంట్లో గ్రహాలు వ్యతిరేకంగా ప్రవర్తిస్తాయి. శత్రు బాధలు కూడా మీకు కలుగుతాయి. సర్వగ్రహ దోషాలు పోవాలంటే.. శనివారం వెంకటేశ్వర స్వామికి తులసి దళాలతో, బిల్వపత్రాలతో పూజ చేయాలి. తొమ్మిది వత్తులతో దీపాన్ని పెడితే సర్వగ్రహ దోషాలు పోతాయి.

మంగళవారం నాడు హనుమంతుడికి రెండు అరటి పండ్లను నైవేద్యంగా పెట్టి, గోధుమలతో చేసిన పదార్థాలు పెట్టి వాటిని ఏదైనా జీవులకి దానం చేస్తే ఏలినాటి శని పోతుంది. ఇలా మీరు ఈ విధంగా ఆచరించడం వలన గ్రహ దోషాలు పోతాయి. ఈ తప్పులను మాత్రం అసలు చేయకుండా చూసుకోండి. లేకపోతే గ్రహదోషాలు వలన జీవితంలో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. సంతోషంగా జీవించలేరు.

Admin

Recent Posts