food

Left Over Rice Vada : మిగిలిపోయిన అన్నంతో అప్ప‌టిక‌ప్పుడు వ‌డ‌ల‌ను ఇలా చేయండి.. ఎంతో రుచిగా ఉంటాయి..!

Left Over Rice Vada : మ‌నం అల్పాహారంలో భాగంగా అప్పుడ‌ప్పుడు వ‌డ‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. వ‌డ‌లు చాలా రుచిగా ఉంటాయి. వీటిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే త‌ర‌చూ ఒకేర‌కంగా కాకుండా మ‌నం అన్నంతో కూడా వ‌డ‌ల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. అన్నంతో చేసే ఈ వ‌డ‌లు చాలా క్రిస్పీగా ఉంటాయి. అలాగే వీటిని ఇన్ స్టాంట్ గా త‌యారు చేసుకోవ‌చ్చు. ఇంట్లో అన్నం ఎక్కువ‌గా మిగిలిన‌ప్పుడు, ఉద‌యం పూట స‌మ‌యం త‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు వీటిని త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. ఈవ‌డ‌ల‌ను త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ఎంతో రుచిగా, క్రిస్పీగా ఉండే ఈ రైస్ వ‌డ‌ల‌ను ఇన్ స్టాంట్ గా ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

రైస్ వ‌డ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

అన్నం – ఒక క‌ప్పు, బొంబాయి ర‌వ్వ – ఒక క‌ప్పు, పెరుగు – అర క‌ప్పు, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, త‌రిగిన క‌రివేపాకు – ఒక రెమ్మ‌, చిన్న‌గా త‌రిగిన అల్లం ముక్క‌లు – అర టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, చిన్న‌గా త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, క్యారెట్ తురుము – పావు క‌ప్పు, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ – 1, ఉప్పు – త‌గినంత‌, వంట‌సోడా – చిటికెడు, నూనె – డీప్ ఫ్రై స‌రిప‌డా.

how to make vada with left over rice very easy method

రైస్ వ‌డ త‌యారీ విధానం..

ముందుగా జార్ లో అన్నం, ర‌వ్వ‌, పెరుగు వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత ఇందులో వంటసోడా, నూనె త‌ప్ప మిగిలిన ప‌దార్థాలన్నీ వేసి బాగా కల‌పాలి. త‌రువాత మూత పెట్టి 10 నిమిషాల పాటు పిండిని నాన‌బెట్టాలి. పిండి నానిన త‌రువాత ఇందులో వంట‌సోడా వేసి క‌ల‌పాలి. పిండి మ‌రీ గ‌ట్టిగా ఉంటే కొద్దిగా నీళ్లు పోసి వ‌డ పిండిలాగా క‌లుపుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక చేతుల‌కు నీటితో త‌డి చేసుకుంటూ పిండిని తీసుకుని వ‌డ‌లాగా వ‌త్తుకుని నూనెలో వేసుకోవాలి. ఈ వ‌డ‌ల‌ను మ‌ధ్య‌స్థ మంట‌పై ఎర్ర‌గా, క్రిస్పీగా అయ్యే వ‌ర‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వల్ల ఎంతో రుచిగా ఉండే రైస్ వ‌డ‌లు త‌యార‌వుతాయి. వీటిని చ‌ట్నీతో తింటే చాలా రుచిగా ఉంటాయి. ఇలా చాలా సుల‌భంగా చాలా త‌క్కువ స‌మ‌యంలో మ‌నం అన్నంతో రుచిగా వ‌డ‌ల‌ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు.

Admin

Recent Posts