vastu

Watch : వాస్తు ప్ర‌కారం మీ చేతి వాచ్‌ని ఇలా పెట్టుకోండి.. ల‌క్ క‌ల‌సి వ‌స్తుంది..!

Watch : చాలామంది, వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. నిజానికి మనం వాస్తు ప్రకారం నడుచుకోవడం వలన, అంతా మంచి జరుగుతుంది. పాజిటివ్ ఎనర్జీ కూడా కలుగుతుంది. నెగటివ్ ఎనర్జీ ఉంటే తొలగిపోతుంది. వాస్తు ప్రకారం, చిన్న చిన్న పొరపాట్లు కూడా చేయకుండా, మనం చక్కగా పాటించినట్లయితే, మంచి ఎనర్జీ వస్తుంది. మనం ఇంట్లో ఏ వస్తువుని, ఏ దిక్కులో పెట్టుకోవాలి అనేది కూడా వాస్తు ప్రకారం పాటించినట్లయితే, ఎంతో మంచి జరుగుతుంది. చక్కటి పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుంది. ప్రతి ఒక్కరికి ఇళ్లల్లో గడియారాలు కూడా ఉంటాయి.

గడియారాలని పెట్టుకునేటప్పుడు కూడా, కచ్చితంగా వాస్తు ప్రకారం పాటించడం మంచిది. అలానే, వాచీని పెట్టుకునేటప్పుడు కూడా వాస్తుని పాటించడం మంచిది. ఇటువంటి చిన్న చిన్న వాటిని, మీరు అనుసరించినట్లయితే జీవితంలో ఇబ్బందులు తొలగిపోతాయి. వాస్తు ప్రకారం, వాచీని పెట్టుకునేటప్పుడు డయల్ చాలా పెద్దదిగా ఉండకూడదని గుర్తు పెట్టుకోండి. పెద్ద డయల్ ఉన్న వాచీని పెట్టుకోవడం వలన, జీవితంలో అలానే కెరియర్ లో కూడా కొన్ని రకాల సమస్యలు వస్తాయి.

how to wear watch according to vastu

డయల్ ఆకారం రౌండ్ లేదా చదరపు ఆకారంలో ఉండాలి. ఏ చేతికి వాచిని పెట్టుకోవాలి అనే దానిలో, ఎటువంటి నియమం కూడా లేదు. కుడి చేతికి వాచిని పెట్టుకుంటే సౌకర్యంగా ఉంటే, ఆ చేతికి పెట్టుకోవచ్చు. అందులో ఆలోచించక్కర్లేదు. వాచీ ఎప్పుడూ కూడా వదులుగా ఉండకూడదు.

వాచీని పెట్టుకునేటప్పుడు, పట్టి మణికట్టు ఎముకకి దగ్గరగా ఉండాలి. వెండి రంగు వాచిని పెట్టుకుంటే, ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. బంగారు లేదా వెండి రంగు వాచిని పెట్టుకుంటే బాగా కలిసి వస్తుంది. ఈసారి వాచీ ని పెట్టుకునేటప్పుడు ఈ నియమాలని కచ్చితంగా పాటించేటట్టు చూసుకోండి. అప్పుడు కచ్చితంగా అంతా మంచి జరుగుతుంది. ఏ సమస్య కూడా ఉండదు.

Admin

Recent Posts