Dondakaya Tomato Pachadi : దొండ‌కాయ‌లు, ట‌మాటాలు క‌లిపి ప‌చ్చ‌డిని ఇలా చేస్తే.. ఎంతో రుచిగా ఉంటుంది..

Dondakaya Tomato Pachadi : మ‌నం దొండ‌కాయ‌ల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. దొండ‌కాయ మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వీటితో ర‌క‌ర‌కాల కూర‌ల‌ను, ప‌చ్చ‌ళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. దొండ‌కాయ‌ల‌తో చేసే ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. దొండ‌కాయ‌ల‌ను ఇష్ట‌ప‌డ‌ని వారు కూడా ఈ ప‌చ్చ‌డిని ఇష్టంగా తింటారు. రుచిగా, స‌లుభంగా దొండ‌కాయ ట‌మాట ప‌చ్చ‌డిని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

దొండ‌కాయ ట‌మాట ప‌చ్చ‌డి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

స‌న్న‌గా గుండ్రంగా త‌రిగిన దొండ‌కాయ‌లు – పావు కిలో, త‌రిగిన ట‌మాటాలు – 2, ప‌చ్చిమిర్చి – 10 లేదా కారానికి త‌గిన‌న్ని, నాన‌బెట్టిన చింత‌పండు – చిన్న నిమ్మ‌కాయంత‌, వెల్లుల్లి రెబ్బ‌లు – 5, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు – త‌గినంత‌, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 2, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, ప‌సుపు – పావు టీ స్పూన్, క‌చ్చా ప‌చ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు – 5.

Dondakaya Tomato Pachadi recipe in telugu very easy to make
Dondakaya Tomato Pachadi

దొండ‌కాయ ట‌మాట ప‌చ్చ‌డి త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక దొండ‌కాయ ముక్క‌లు, ప‌చ్చిమిర్చి వేసి వేయించాలి. దొండ‌కాయ ముక్క‌లు పూర్తిగా వేగిన త‌రువాత అందులో ట‌మాట ముక్క‌లు, చింత‌పండు, ఉప్పు, ప‌సుపు వేసి క‌ల‌పాలి. ట‌మాట ముక్క‌లు మెత్త‌గా అయ్యే వ‌ర‌కు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకుని చ‌ల్లారే వ‌ర‌కు ఉంచాలి. త‌రువాత వీటిని ఒక జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే వెల్లుల్లి రెబ్బ‌లు, జీల‌క‌ర్ర వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్య‌క తాళింపు దినుసులు, ఎండుమిర్చి, క‌రివేపాకు, వెల్లుల్లి రెబ్బ‌లు వేసి వేయించాలి.

త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న ప‌చ్చ‌డిని వేసి క‌ల‌పాలి. దీనిని మ‌రో రెండు నిమిషాల పాటు క‌లుపుతూ వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే దొండ‌కాయ ట‌మాట ప‌చ్చ‌డి త‌యారవుతుంది. దీనిని వేడి వేడి అన్నం, నెయ్యితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. దొండ‌కాయ‌ల‌తో ఈ విధంగా చేసిన ప‌చ్చ‌డిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Share
D

Recent Posts