Egg Noodles : బ‌య‌ట ల‌భించే రుచితో.. ఎగ్ నూడుల్స్‌ను ఇలా ఇంట్లోనే చేసుకోవ‌చ్చు..!

Egg Noodles : మ‌న‌కు ప్ర‌స్తుత కాలంలో బ‌య‌ట ఎక్కువ‌గా ల‌భిస్తున్న‌ చిరుతిళ్లలో నూడుల్స్ కూడా ఒక‌టి. హోట‌ల్స్ లో, పాస్ట్ ఫుడ్ సెంట‌ర్ల‌లో ఇవి మ‌న‌కు విరివిరిగా ల‌భిస్తున్నాయి. వీటిని చాలా మంది ఇష్టంగా తింటుంటారు. మ‌న‌కు వివిధ ర‌కాల రుచుల్లో ఈ నూడుల్స్ ల‌భ్య‌మ‌వుతాయి. వాటిల్లో ఎగ్ నూడుల్స్ కూడా ఒక‌టి. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. బ‌య‌ట ల‌భించే విధంగా ఉండే ఈ ఎగ్ నూడుల్స్ ను మ‌నం ఇంట్లోనే చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. వీటిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Egg Noodles are very easy to make do like this
Egg Noodles

ఎగ్ నూడుల్స్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూడుల్స్ – ఒక ప్యాకెట్, కోడిగుడ్లు – 3 లేదా త‌గిన‌న్ని, నూనె – ఒక‌టిన్న‌ర టేబుల్ స్పూన్స్, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ – 1 (పెద్ద‌ది), పొడుగ్గా స‌న్న‌గా త‌రిగిన క్యాప్సికం – 1 (పెద్ద‌ది), పొడుగ్గా స‌న్న‌గా త‌రిగిన క్యారెట్ – 1, స‌న్న‌గా త‌రిగిన క్యాబేజ్ – అర క‌ప్పు, సోయాసాస్ – ఒక టీ స్పూన్, వెనిగ‌ర్ – ఒక టీ స్పూన్, చిల్లీ సాస్ – ఒక టీ స్పూన్, మిరియాల పొడి – అర టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌.

ఎగ్ నూడుల్స్ త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో ఒక లీట‌ర్ నీటిని తీసుకుని వాటిని మ‌రిగించాలి. నీళ్లు మ‌రిగిన త‌రువాత నూడుల్స్ ను వేసి 5 నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు నూడుల్స్ లో ఉన్న నీటిని పార‌బోసి చ‌ల్ల‌ని నీటిని పోసి 4 నుండి 5 సార్లు క‌డ‌గాలి. త‌రువాత నూడుల్స్ ను ఒక జ‌ల్లిగిన్నెలోకి తీసుకుని నీళ్లు అన్నీ పోయేలా చేసుకోవాలి. ఇప్పుడు ఒక క‌ళాయిలో నూనె వేసి నూనె కాగిన త‌రువాత కోడిగుడ్ల‌ను ప‌గ‌ల‌గొట్టి వేయాలి. వీటిని రెండు నిమిషాల పాటు ఉడికించిన త‌రువాత కావల్సిన ప‌రిమాణంలో ముక్క‌లుగా చేసుకుని మ‌రో రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి. త‌రువాత ఉల్లిపాయ‌ల‌ను వేసి వేయించుకోవాలి.

ఉల్లిపాయ‌లు వేగిన త‌రువాత క్యాప్సికం, క్యాబేజ్, క్యారెట్ ముక్క‌ల‌ను వేసి 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. త‌రువాత సోయాసాస్, ఉప్పు, మిరియాల పొడి, చిల్లీ సాస్, వెనిగ‌ర్ వేసి బాగా క‌లిపి ఒక నిమిషం పాటు వేయించాలి. త‌రువాత ఉడికించిన నూడుల్స్ ను వేసి అంతా క‌లిసేలా బాగా క‌ల‌పాలి. ఈ నూడుల్స్ ను 5 నిమిషాల పాటు క‌లుపుతూ వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఎగ్ నూడుల్స్ త‌యార‌వుతాయి. అప్పుడ‌ప్పుడూ సాయంత్రం వేళల్లో స్నాక్స్ గా ఇలా ఎగ్ నూడుల్స్ ను చేసుకుని తిన‌వ‌చ్చు. బ‌య‌ట అప‌రిశుభ్ర వాతావ‌ర‌ణంలో చేసే వాటిని తిన‌డానికి బ‌దులుగా ఇలా నూడుల్స్ ను ఇంట్లోనే చేసుకోవ‌చ్చు. ఈ విధంగా చేసిన ఎగ్ నూడుల్స్ ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts