Mutton Fry : మ‌ట‌న్ ఫ్రై ఎంతో రుచిక‌రం.. త‌యారు చేయ‌డం చాలా సుల‌భం..!

Mutton Fry : మ‌న‌లో చాలా మంది ఇష్టంగా తినే మాంసాహార ఉత్ప‌త్తుల్లో మ‌ట‌న్ కూడా ఒక‌టి. మ‌ట‌న్ ను మ‌నం అప్పుడ‌ప్పుడూ ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. దీనిని మితంగా తిన‌డం వ‌ల్ల మ‌న శరీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. మ‌ట‌న్ ను తిన‌డం వల్ల శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ప్రోటీన్స్, విట‌మిన్స్, మిన‌ర‌ల్స్ తోపాటు వివిధ ర‌కాల పోష‌కాలు కూడా ల‌భిస్తాయి. మ‌ట‌న్ ను మ‌నం వివిద‌ ర‌కాలుగా వండుకుని తింటూ ఉంటాం. మ‌ట‌న్ తో చేసుకోగ‌లిగే వంట‌కాల్లో మ‌ట‌న్ ఫ్రై కూడా ఒక‌టి. మ‌ట‌న్ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భ‌మే. మ‌ట‌న్ ఫ్రై ని ఎలా త‌యారు చేసుకోవాలి.. దీని త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

Mutton Fry is very easy and simple to make
Mutton Fry

మ‌ట‌న్ ఫ్రై త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

మ‌ట‌న్ – అర కిలో, నూనె – 2 టేబుల్ స్పూన్స్, సాజీరా – ఒక టీ స్పూన్, దాల్చిన చెక్క ముక్క – 1, యాల‌కులు – 2, ల‌వంగాలు – 3, త‌రిగిన ప‌చ్చి మిర్చి – 3, క‌రివేపాకు – ఒక రెబ్బ‌, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ – 1 ( పెద్ద‌ది), ఉప్పు – త‌గినంత‌, ప‌సుపు – పావు టీ స్పూన్, కారం – 2 టీ స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టీ స్పూన్స్, ధ‌నియాల పొడి – 2 టీ స్పూన్స్, జీల‌క‌ర్ర పొడి – అర టీ స్పూన్, గ‌రం మ‌సాలా – ఒక టీ స్పూన్, పెరుగు – అర క‌ప్పు, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

మ‌ట‌న్ ఫ్రై త‌యారీ విధానం..

ముందుగా మ‌ట‌న్ ను శుభ్రంగా క‌డిగి కుక్క‌ర్ లోకి తీసుకోవాలి. త‌రువాత ఇందులోనే ప‌సుపు, కారం, ఉప్పు, ధ‌నియాల పొడి, గ‌రం మసాలా, జీలక‌ర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు వేసి బాగా క‌ల‌పాలి. దీనిని అర గంట నుంచి ఒక గంట పాటు ఫ్రిజ్ లో ఉంచాలి. త‌రువాత కుక్క‌ర్ మీద మూత ఉంచి 4 నుండి 5 విజిల్స్ వ‌చ్చే వ‌ర‌కు ఉడికించాలి. త‌రువాత మూత తీసి మ‌ట‌న్ లో ఉన్న నీళ్లు అన్నీ పోయి ద‌గ్గ‌ర‌ప‌డే వ‌ర‌కు మ‌ర‌లా స్ట‌వ్ మీద ఉంచి ఉడికించాలి.

ఇప్పుడు ఒక క‌ళాయిలో నూనె వేసి నూనె కాగిన త‌రువాత సాజీరా, ల‌వంగాలు, యాల‌కులు, దాల్చిన చెక్క వేసి వేయించాలి. త‌రువాత ప‌చ్చి మిర్చి, క‌రివేపాకు వేసి వేయించాలి. ఇవి వేగిన త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు వేగిన త‌రువాత ఉడికించిన మ‌ట‌న్ ను వేసి బాగా వేయించాలి. మ‌ట‌న్ లోని నీరు అంతా పోయి మట‌న్ బాగా వేగిన త‌రువాత కొత్తిమీర చ‌ల్లి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే మ‌ట‌న్ ఫ్రై త‌యార‌వుతుంది. ఇలా చేసుకున్న మ‌ట‌న్ ఫ్రై ని పులావ్, బిర్యానీ వంటి వాటితో కూడా క‌లిపి తిన‌వ‌చ్చు. మ‌ట‌న్ తో త‌ర‌చూ చేసే వంట‌కాల‌కు బ‌దులుగా ఇలా ఫ్రై ని కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు.

Share
D

Recent Posts