Eggless Milk Cake : కోడిగుడ్లు లేకుండానే మిల్క్ కేక్‌ను ఎంతో రుచిగా ఇలా చేయ‌వ‌చ్చు.. ఎలాగంటే..?

Eggless Milk Cake : పిల్ల‌లు, పెద్ద‌లు ఇష్టంగా తినే చిరుతిళ్ల‌ల్లో కేక్ ఒక‌టి. దీనిని తిన‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. మ‌న‌కు రుచికి త‌గిన‌ట్టుగా వివిధ ర‌కాల కేక్ ల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. ఇలా రుచిగా ఉండంతో మ‌నం సుల‌భంగా త‌యారు చేసుకోగిలిగిన వాటిల్లో మిల్క్ కేక్ ఒక‌టి. ఈ కేక్ నుకోడిగుడ్ల‌ను, బీట‌ర్ ను ఉయోగించ‌కుండా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. పిల్లలు కూడా ఈ కేక్ ను సులువుగా చేయ‌వ‌చ్చు. కోడిగుడ్లు, బీట‌ర్ లేకుండా రుచిగా, సుల‌భంగా మిల్క్ కేక్ ను ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ఎగ్ లెస్ మిల్క్ కేక్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

మిల్క్ పౌడ‌ర్ – 60 గ్రా., నీళ్లు – 180 ఎమ్ ఎల్, పంచ‌దార – 180 గ్రాములు, మైదా పిండి – 180 గ్రా., బేకింగ్ పౌడ‌ర్ – ఒక టేబుల్ స్పూన్, క‌రిగించిన బ‌ట‌ర్ – 180 గ్రా., మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ – త‌గిన‌న్ని, టూటీ ఫ్రూటీ – 3 టేబుల్ స్పూన్స్.

Eggless Milk Cake recipe in telugu very tasty and sweet
Eggless Milk Cake

ఎగ్ లెస్ మిల్క్ కేక్ త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో నీళ్లు తీసుకోవాలి. త‌రువాత అందులో పంచ‌దార వేసి పంచ‌దార క‌రిగే వ‌ర‌కు క‌లుపుతూ ఉండాలి. త‌రువాత మిల్క్ పౌడ‌ర్ వేసి ఉండ‌లు లేకుండా క‌లుపుకోవాలి. త‌రువాత ఇందులో జల్లెడను ఉంచి మైదాపిండి, బేకింగ్ పౌడ‌ర్ వేసి జ‌ల్లించి వేసుకోవాలి. త‌రువాత ఉండ‌లు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా క‌లుపుకున్న త‌రువాత బ‌ట‌ర్ వేసి క‌లుపుకోవాలి. ఇప్పుడు అల్యూమినియం గిన్నెను తీసుకుని దానికి నెయ్యి లేదా బ‌ట‌ర్ ను రాసుకోవాలి. త‌రువాత దానిపై పొడి మైదా పిండిని చ‌ల్లుకోవాలి. ఈ గిన్నెలో ముందుగా త‌యారు చేసుకున్న కేక్ మిశ్ర‌మాన్ని వేసుకోవాలి. త‌రువాత దానిపై డ్రై ఫ్రూట్స్ ను టూటీ ఫ్రూటీ ని చ‌ల్లుకోవాలి.

ఇప్పుడు కుక్క‌ర్ లో స్టాండ్ ను ఉంచి విజిల్ లేకుండా మూత పెట్టి 10 నిమిషాల పాటు వేడి చేయాలి. త‌రువాత కేక్ గిన్నెను కుక్కర్ లో ఉంచి విజిల్ లేకుండా మూత పెట్టి 45 నుండి 50 నిమిషాల పాటు చిన్న మంట‌పై ఉడికించాలి. ఈ కేక్ ను ఒవెన్ లో ఉంచి కూడా తయారు చేసుకోవ‌చ్చు. ఫ్రీ హీట్ చేసిన ఒవెన్ లో 180 డిగ్రీల వ‌ద్ద 25 నుండి 30 నిమిషాల పాటు ఉడికించాలి. త‌రువాత ఈ కేక్ ను గిన్నె అంచుల నుండి వేరు చేసి ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత కావాల్సిన ఆకారంలో ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఎగ్ లెస్ మిల్క్ కేక్ త‌యార‌వుతుంది. కేక్ తినాల‌నిపించిన‌ప్పుడు ఇలా చాలా సులువుగా త‌క్కువ స‌మ‌యంలో అయ్యే మిల్క్ కేక్ ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు.

Share
D

Recent Posts