Instant Bread Idli : ఇడ్లీల‌ను అప్ప‌టిక‌ప్పుడు ఇలా ఇన్‌స్టంట్‌గా చేసుకోవ‌చ్చు.. ఎలాగో తెలుసా..?

Instant Bread Idli : మ‌నం రోజూ వివిధ ర‌కాల బ్రేక్‌ఫాస్ట్‌ల‌ను చేస్తుంటాం. ఇడ్లీ, దోశ‌, ఉప్మా ఇలా ఉద‌యం అల్పాహారాల‌ను తింటుంటాం. అయితే చాలా మంది తినే వాటిల్లో ఇడ్లీ ఒక‌టి. ఇది అంటే చాలా మందికి ఇష్ట‌మే. ఇడ్లీల‌ను చ‌ట్నీ లేదా సాంబార్‌, కారం పొడితో తిన‌వ‌చ్చు. దేంతో తిన్నా స‌రే ఇడ్లీలు ఎంతో రుచిగా ఉంటాయి. అయితే సాధార‌ణంగా ఇడ్లీల‌ను మిన‌ప ప‌ప్పుతో చేస్తుంటారు. కానీ బ్రెడ్‌తోనూ చేయ‌వ‌చ్చు. ఇవి కూడా ఎంతో రుచిగా ఉంటాయి. త‌యారు చేయ‌డం కూడా సుల‌భ‌మే. అప్ప‌టిక‌ప్పుడు ఇన్‌స్టంట్‌గా వీటిని చేసుకోవ‌చ్చు. ఇక‌ బ్రెడ్‌తో ఇడ్లీల‌ను ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

బ్రెడ్ ఇడ్లీల త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

బ్రెడ్ స్లైస్ లు – 4, ఇడ్లీ ర‌వ్వ – 1 క‌ప్పు, పెరుగు – 1 క‌ప్పు, నీళ్లు – త‌గిన‌న్ని, బేకింగ్ సోడా – చిటికెడు, నూనె – కొద్దిగా.

Instant Bread Idli recipe in telugu very easy to make
Instant Bread Idli

బ్రెడ్ ఇడ్లీల‌ను త‌యారు చేసే విధానం..

బ్రెడ్ స్లైస్ ల అంచుల‌ను తీసేయాలి. ఒక పాత్ర‌లో బ్రెడ్‌ను పొడి పొడిగా చేసి వేయాలి. ఒక క‌ప్పు ఇడ్లీ ర‌వ్వ జ‌త చేయాలి. ఉప్పు, పెరుగు జ‌త చేయాలి. త‌గిన‌న్ని నీళ్లు పోసి క‌లియ‌బెట్టి మూత పెట్టి అర గంట సేపు ప‌క్క‌న ఉంచాలి. బేకింగ్ సోడా జ‌త చేసి క‌ల‌పాలి. ఇడ్లీ రేకుల‌పై కొద్దిగా నూనె రాయాలి. ఒక్కో గుంత‌లో గ‌రిటెడు పిండి వేయాలి. ఇడ్లీ కుక్క‌ర్‌లో త‌గిన‌న్ని నీళ్లు పోసి ఇడ్లీ రేకుల‌ను అందులో ఉంచి మూత పెట్టి స్ట‌వ్ మీద ఉంచాలి. 10 నిమిషాల త‌రువాత దింపేయాలి. దీంతో ఎంతో రుచిక‌ర‌మైన బ్రెడ్ ఇడ్లీలు రెడీ అవుతాయి. వీటిని కొబ్బ‌రి చ‌ట్నీ, సాంబార్ ల‌తో తిన‌వ‌చ్చు. ఎంతో రుచిగా ఉంటాయి. అంద‌రూ ఇష్టంగా తింటారు.

Editor

Recent Posts