Endu Mirchi Pappu : ఎండు మిర్చితో ప‌ప్పును ఎప్పుడైనా చేశారా.. ఒక్క‌సారి చేసి తినండి.. వ‌హ్వా అంటారు..

Endu Mirchi Pappu : మ‌నం వంట‌ల తాళింపులో ఎక్కువ‌గా వాడే ప‌దార్థాల్లో ఎండుమిర్చి కూడా ఒక‌టి. ఎండుమిర్చితో మ‌నం ర‌క‌ర‌కాల ప‌చ్చ‌ళ్ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. ఎండుమిర్చి వేయ‌డం వ‌ల్ల మ‌నం చేసే వంట‌ల రుచి పెరుగుతుంద‌ని చెప్ప‌డంలో ఎటువంటి సందేహం లేదు. తాళింపులో వాడ‌డంతో పాటు ఎండుమిర్చితో మ‌నం ప‌ప్పును కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఎండుమిర్చితో చేసే ఈ ప‌ప్పు చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఎక్కువ‌గా రాయ‌ల‌సీమ ప్రాంతంలో త‌యారు చేస్తారు. చాలా మంది ఈ ప‌ప్పును ఇష్టంగా తింటారు. ఎండుమిర్చితో రుచిగా, సుల‌భంగా ప‌ప్పును ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ఎండుమిర్చి ప‌ప్పు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – ఒక టేబుల్ స్పూన్, కందిప‌ప్పు – అర క‌ప్పు, , జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, త‌రిగిన ఉల్లిపాయ – 1, చింత‌పండు – ఒక రెమ్మ‌, ప‌సుపు – అర టీ స్పూన్, ముక్క‌లుగా చేసిన ఎండుమిర్చి – 8 లేదా త‌గిన‌న్ని, నీళ్లు – రెండున్న‌ర క‌ప్పులు, ఉప్పు – త‌గినంత‌, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.

Endu Mirchi Pappu recipe in telugu very tasty how to make this
Endu Mirchi Pappu

తాళింపు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నెయ్యి లేదా నూనె – 2 టీ స్పూన్స్, మెంతులు – పావు టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, క‌చ్చా ప‌చ్చాగా దంచిన ధ‌నియాలు – అర టీ స్పూన్, దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు – 4, శ‌న‌గ‌ప‌ప్పు – ఒక టీ స్పూన్, మిన‌ప‌ప్పు – ఒక టీ స్పూన్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, క‌రివేపాకు – ఒక రెబ్బ‌.

ఎండుమిర్చి పప్పు త‌యారీ విధానం..

ముందుగా కుక్క‌ర్ లో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక కందిప‌ప్పు వేసి చ‌క్క‌టి వాస‌న వ‌చ్చే వ‌ర‌కు దోర‌గా వేయించాలి. త‌రువాత ఉప్పు, కొత్తిమీర త‌ప్ప మిగిలిన ప‌దార్థాల‌ను వేసి మూత పెట్టాలి. ఈ పప్పును 5 విజిల్స్ వ‌చ్చే వ‌ర‌కు ఉడికించుకోవాలి. త‌రువాత ప‌ప్పును మెత్త‌గా చేసుకోవాలి. త‌రువాత త‌గినంత ఉప్పు వేసి క‌ల‌పాలి. ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక మెంతులు వేసి వేయించాలి. ఇవి వేగిన త‌రువాత మిగిలిన తాళింపు ప‌దార్థాల‌ను ఒక్కొక్క‌టిగా వేసి వేయించాలి. తాళింపు చ‌క్క‌గా వేగిన త‌రువాత ముందుగా సిద్దం చేసుకున్న ప‌ప్పును వేసి క‌లపాలి. దీనిని ఒక నిమిషం పాటు ఉడికించి కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఎండుమిర్చి ప‌ప్పు త‌యార‌వుతుంది. దీనిని అన్నం, రొట్టె, చ‌పాతీ, పుల్కా ఇలా దేనితోనైనా తిన‌వ‌చ్చు. ఈ ప‌ప్పును ఇంట్లో అంద‌రూ లొట్ట‌లేసుకుంటూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts