వినోదం

Arjun Reddy : అర్జున్ రెడ్డి సినిమా నుంచి మనం నేర్చుకోవాల్సిన ముఖ్య‌మైన‌ విషయాలు ఇవే..!

Arjun Reddy : విజ‌య్ దేవ‌ర‌కొండ‌, షాలినీ పాండేలు హీరో హీరోయిన్లుగా న‌టించిన చిత్రం.. అర్జున్ రెడ్డి. ఈ మూవీ అప్ప‌ట్లో సృష్టించిన సెన్సేష‌న్ అంతా ఇంతా కాదు. బాక్సాఫీస్ వ‌ద్ద నిర్మాత‌ల‌కు క‌న‌క వ‌ర్షం కురిపించింది. దీంతో విజ‌య్ కెరీర్ ఒక్క‌సారిగా మారిపోయింది. స్టార్ హీరో అయ్యాడు. ఇక ఈ మూవీ ఇత‌ర భాష‌ల్లోకి కూడా తెర‌కెక్కి అద్భుత‌మైన విజ‌యాన్ని సాధించింది. అయితే అర్జున్ రెడ్డి మూవీ అంటే చాలా మంది బూతులు అనుకుంటారు. కానీ అందులో నుంచి మ‌నం నేర్చుకోవాల్సిన నీతులు కూడా చాలానే ఉన్నాయి. ఎన్నో వివాదాల న‌డుమ ఈ మూవీ తెర‌కెక్క‌గా.. ఇందులో చాలా బూతులు ఉన్నాయ‌ని అనేక మంది విమ‌ర్శించారు. అయితే ఈ మూవీ నుంచి మ‌నం నేర్చుకోవాల్సిన‌వి.. నిజ జీవితంలో పాటించాల్సిన‌వి.. అనేకం ఉన్నాయి. వాటిల్లో కొన్ని ముఖ్య‌మైన విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

పర్సనల్ గా ప్రాబ్ల‌మ్ వచ్చింది అని కెరీర్ ను ఎప్పటికి వదులుకోకు. అసలే ఈ మధ్య లవ్ ఫెయిల్ అయ్యిందని ఫేస్ బుక్ లో పోస్ట్ లు పెట్టి సూసైడ్ లు చేసుకునే వారు ఎక్కువైపోయారు. సినిమాలో ప్రీతి వదిలేసినా కూడా అర్జున్ రెడ్డి బెస్ట్ డాక్టర్ గా పేరు తెచ్చుకుంటాడు. క‌నుక ల‌వ్ అన్న‌ది ఒక్క‌టే జీవితం కాద‌ని.. మ‌న‌కంటూ ఒక లైఫ్ ఉంటుంద‌నే విష‌యాన్ని ఈ సినిమా నుంచి మ‌నం నేర్చుకోవాలి. అలాగే సినిమా స్టార్టింగ్ లో కాలేజీ పరువు గురించి ఆలోచించకుండా తనలా తాను ఉంటాడు. మనకి ఒక కూడా ఆటిట్యూడ్ ఉంటుంది. అదే మనల్ని జీవితంలో ముందుకి తీసుకెళ్లేది. అలా అని మనకు అనిపిస్తే ఎవరెన్ని చెప్పినా మ‌న యాటిట్యూడ్‌ను వదులుకోవద్దు. మ‌నం మ‌న‌లాగే ఉండాలి.

facts we should learn from arjun reddy movie

ఇక సినిమాలో ప్రీతి పెళ్లి జరుగుతున్నప్పుడు అర్జున్ రెడ్డి ఆపలేని స్టేజిలో ఉంటాడు. దానికి కారణం మొర్ఫిన్ తీసుకోవడం. కానీ మనం అలా చేయకూడదు. మనల్ని ప్రేమించే వారిని వదులుకోవాలి అన్న ఆలోచన కూడా రానివ్వద్దు. ఏదో ఒక‌టి చేయాలి. అలాగే శివ లాంటి ఫ్రెండ్ దొరకడం చాలా కష్టం. సంతోషంలోనే కాదు బాధల్లోనూ తోడుండే అలాంటి ఫ్రెండ్ ని ఎప్పటికీ వదులుకోవద్దు. ఇక శివతో అర్జున్ రెడ్డి పీరియడ్స్ గురించి చాలా ఓపెన్ గా మాట్లాడతాడు. మనమేమో అదేదో బూతులాగా చూస్తాము. మన ఆలోచన మంచిది అయినప్పుడు అది బూతు అవ్వదు. ధైర్యంగా మాట్లాడు. అలాగే అర్జున్ నానమ్మ సఫర్ అవ్వనివ్వు అంటారు. ఎందుకంటే ఎదుటోడిని బాధ పడకు అని చెప్పగలము కానీ బాధను పంచుకోలేము. నొప్పి తనది కాబట్టి.

అర్జున్ నానమ్మ చనిపోయినప్పుడు అర్జున్ ఆమె ఫేవరెట్ సాంగ్ ప్లే చేస్తాడు. అలా చేస్తే ఆత్మ ప్రశాంతంగా వెళ్ళిపోతుంది. అర్జున్ కి ప్రీతి ప్రెగ్నెంట్‌ గా ఉన్నప్పుడు కనిపిస్తుంది. కడుపులో పెరుగుతుంది వేరొకరి బిడ్డ అయినా నా బిడ్డగా పెరుగుతుంద‌ని చెప్తాడు. నిజంగా ప్రేమించడం అంటే అది. చివరికి అది తన బిడ్డే అని తెలుస్తుంది. ఆపరేషన్ అర్జెంటు అంటే తన పరిస్థితి బాగాలేకున్నా వెళ్తాడు. తర్వాత డాక్టర్ చదివేటప్పుడు చేసిన ప్రామిస్ గుర్తుతెచ్చుకుంటాడు. నాకు నా లైఫ్ లో నచ్చింది కెరీర్ ఒక్కటే అంటాడు. ప్రీతికి టాపిక్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా అని తీసుకెళ్తాడు. ప్రతి సారీ అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు అనుకుంటాము. కానీ డాక్టర్ ప్రొఫెషన్ గొప్పతనం చెప్తాడు. ఇంకోసారి టాపిక్ గురించి వచ్చినప్పుడు అప్పటికి ఆ అమ్మాయితో తనకి రిలేషన్ లేదు కాబట్టి ఇబ్బంది పడి వెళ్లిపోతాడు. ఇలా అర్జున్ రెడ్డి మూవీ నుంచి మ‌నం కొన్ని విష‌యాల‌ను నేర్చుకోవ‌చ్చు. వాటిని మ‌న జీవితంలో పాటించ‌వ‌చ్చు.

Admin

Recent Posts