హెల్త్ టిప్స్

Cloves : పూటకు ఒక్క ల‌వంగం చాలు.. ఎన్ని ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయంటే..?

Cloves : మ‌నం లవంగాల‌ను ఎక్కువ‌గా కూర‌ల్లో వేస్తుంటాం. మాంసం కూర‌లు, బిర్యానీలలో వీటిని బాగా వాడుతారు. ల‌వంగాలు వేస్తే కూర‌ల‌కు చ‌క్క‌ని టేస్ట్ వ‌స్తుంది. అయితే కేవ‌లం రుచికే కాదు.. ల‌వంగాలు మ‌న‌కు ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాల‌ను అందించ‌డంలోనూ ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. మ‌రి మ‌న‌కు క‌లిగే అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను ల‌వంగాల‌తో ఎలా త‌గ్గించుకోవ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందామా.

నోరు బాగా దుర్వాస‌న వ‌స్తుంటే రెండు, మూడు ల‌వంగాల‌ను నోట్లో వేసుకుని న‌మిలితే నోటి దుర్వాస‌న వెంట‌నే త‌గ్గిపోతుంది. నోట్లో ఉండే బాక్టీరియా, క్రిములు న‌శిస్తాయి. క‌డుపులో బాగా వికారంగా అనిపించినా, తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణం కాక‌పోయినా.. రెండు, మూడు లవంగాల‌ను నోట్లో వేసుకుని బాగా న‌మిలి ఆ ర‌సాన్ని మింగితే ఫ‌లితం ఉంటుంది.

many wonderful health benefits with just one clove

రోజుకు ఐదారు ల‌వంగాల‌ను నోట్లో వేసుకుని తింటూ ఉంటే జ‌లుబు, ద‌గ్గు వంటివి వెంట‌నే త‌గ్గిపోతాయి. డ‌యాబెటిస్ ఉన్న వారు నిత్యం మూడు పూటలా ఒక ల‌వంగాన్ని తింటుంటే షుగ‌ర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. ల‌వంగాల‌ను తిన‌డం వ‌ల్ల గ్యాస్ ట్ర‌బుల్ నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. ఇలా ల‌వంగాల‌తో మ‌నం ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.

Share
Admin

Recent Posts