Fish Biryani : చేప‌లతో ఫిష్ బిర్యానీ త‌యారీ ఇలా.. ప‌క్కా కొల‌త‌లతో చేస్తే రుచి అదిరిపోతుంది..

Fish Biryani : ఆదివారం వ‌చ్చిందంటే చాలు.. చాలా మంది నాన్ వెజ్ ప్రియులు ఏం తిందామా.. అని ఆలోచిస్తుంటారు. అందులో భాగంగానే ఎవ‌రికి న‌చ్చిన‌ట్లు వారు వివిధ ర‌కాల నాన్ వెజ్ ఆహారాల‌ను తెచ్చి వండుకుని తింటుంటారు. అయితే నాన్‌వెజ్ ఆహారాల్లో మ‌నం దేంతోనైనా స‌రే బిర్యానీని చేసుకోవ‌చ్చు. స‌హ‌జంగా చాలా మంది చికెన్‌, మ‌ట‌న్‌తో బిర్యానీ చేస్తారు. కానీ చేప‌ల‌తో బిర్యానీ చేయ‌రు. కాస్త శ్ర‌మించాలే కానీ.. చేప‌ల‌తో ఎంతో రుచిక‌ర‌మైన బిర్యానీని చాలా సుల‌భంగా త‌యారు చేయ‌వ‌చ్చు. దీన్ని ఎవ‌రైనా స‌రే ఇష్టంగా తింటారు. చేప‌ల‌తో బిర్యానీని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఫిష్ బిర్యానీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

చేప ముక్క‌లు – 8, బాస్మ‌తి బియ్యం – అర కిలో, ట‌మాటా ప్యూరీ – చిన్న క‌ప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టీస్పూన్లు, వేయించిన ఉల్లిపాయ ముక్క‌లు – ఒక క‌ప్పు, క‌రివేపాకు – రెండు రెబ్బ‌లు, పెరుగు – రెండు టీస్పూన్లు, కారం – ఒక టేబుల్ స్పూన్‌, ప‌సుపు – పావు టీస్పూన్‌, గ‌రం మసాలా – ఒక టీస్పూన్‌, స‌న్న‌గా త‌రిగిన పుదీనా, కొత్తిమీర – కొద్దిగా, ప‌చ్చి మిర్చి – 5, నూనె – 5 టీస్పూన్లు, మ‌సాలా దినుసులు – కొన్ని, నిమ్మ‌ర‌సం – రెండు టీస్పూన్లు, ఉప్పు – త‌గినంత‌.

Fish Biryani recipe in telugu make this perfect dish
Fish Biryani

ఫిష్ బిర్యానీని త‌యారు చేసే విధానం..

చేప ముక్క‌ల‌ను శుభ్రం చేసి నిమ్మ‌ర‌సం, ప‌సుపు, ఉప్పు వేసి బాగా క‌లిపి ప‌క్క‌న పెట్టాలి. స్ట‌వ్ మీద గిన్నె పెట్టి నీళ్లు పోసి మ‌రిగించాలి. ఈ నీళ్ల‌లో ల‌వంగాలు, యాల‌కులు, సాజీరా, దాల్చిన చెక్క‌, ఉప్పు వేయాలి. ఇందులోనే క‌డిగిపెట్టుకున్న బియ్యాన్ని వేసి ముప్పావు వంతు వ‌ర‌కు ఉడికించాలి. మ‌రో పాత్ర‌లో ట‌మాటా పేస్ట్‌, అల్లం వెల్లుల్లి ముద్ద‌, వేయించిన ఉల్లిపాయ ముక్క‌లు, క‌రివేపాకు, పెరుగు, ఉప్పు, కారం, ప‌సుపు, గ‌రం మ‌సాలా, స‌న్న‌గా తరిగిన పుదీనా, కొత్తిమీర‌, ప‌చ్చి మిర్చి ముక్క‌లు, నూనె, నిమ్మ‌ర‌సం వేసి క‌ల‌పాలి. ఈ గిన్నెను పొయ్యి మీద పెట్టి చిన్న‌మంట‌పై 10 నిమిషాల పాటు ఉడికించాలి. కూర నుంచి నూనె బ‌య‌ట‌కు వ‌చ్చే వ‌ర‌కు ఉడికించాలి.

ఆ త‌రువాత చేప ముక్క‌ల‌ను వేసి కొన్ని నీళ్లు పోసి 5 నిమిషాల పాటు ఉడికించాలి. దీనిపై ముప్పావు వంతు వ‌ర‌కు ఉడికించిన అన్నం, నెయ్యి వేసుకోవాలి. మూత పెట్టి పావు గంట పాటు చిన్న మంట‌పై ఉడికించాలి. దీంతో ఫిష్ బిర్యానీ రెడీ అవుతుంది. దీన్ని నేరుగా అలాగే తిన‌వ‌చ్చు. లేదా రైతాతోనూ క‌లిపి తీసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా ఉంటుంది. అంద‌రూ ఇష్ట‌ప‌డ‌తారు. ఎప్పుడూ చేప‌ల‌తో రొటీన్ వంట‌కాల‌ను కాకుండా ఇలా బిర్యానీని చేసి తిన‌డం వ‌ల్ల అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది.

Editor

Recent Posts