Home Tips

House Cleaning : ఈ నాచుర‌ల్ చిట్కాల‌ను పాటిస్తే చాలు.. మీ ఇల్లు క్లీన్ అయి సువాస‌న‌ల‌ను వెద‌జ‌ల్లుతుంది..!

House Cleaning : ఇల్లు అన్నాక మొత్తం లోప‌ల అంతా శుభ్రంగా ఉంటేనే ఎవ‌రూ అనారోగ్యాల బారిన ప‌డ‌కుండా ఉంటారు. ముఖ్యంగా పిల్ల‌లు ఉన్న ఇల్లు అయితే ఇంకా శుభ్రంగా ఉండాలి. కానీ ఇంటిని శుభ్రంగా ఉంచ‌డం క‌ష్ట‌మైపోతుంది. ఎంత క్లీన్ చేసినా కూడా ఎక్క‌డో ఒక చోట ఏదో ఒక వాస‌న వ‌స్తూనే ఉంటుంది. అయితే కింద చెప్పిన ప‌లు చిట్కాల‌ను పాటిస్తే దాంతో మీ ఇంట్లో సువాస‌న‌లు వెద‌జ‌ల్లుతాయి. మీ ఇల్లు చాలా క్లీన్‌గా అవ‌డ‌మే కాదు.. ఇంట్లో ఏ మూల‌కు వెళ్లినా సువాస‌న వ‌స్తుంది. మీ ఇంట్లోకి వ‌చ్చిన అతిథులు కూడా మీ ఇంటి శుభ్ర‌త‌ను చూసి ఆశ్చ‌ర్య‌పోతారు. ఇక అందుకు పాటించాల్సిన చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

నిమ్మ‌కాయ‌ల‌ను పిండాక వ‌చ్చే తొక్క‌ల‌ను ప‌డేయ‌కూడ‌దు. వాటిని నీటిలో వేసి మ‌రిగించాలి. అనంత‌రం ఆ నీటితో ఇంటిని క్లీన్ చేయాలి. దీంతో మీ ఇల్లంతా నిమ్మ‌కాయ సువాస‌న వ‌స్తుంది. తాజాగా అనిపిస్తుంది. ఆ వాస‌న పీలిస్తే మీకు కూడా మైండ్ ఎంతో రిలాక్స్ అవుతుంది. చాలా వ‌ర‌కు హోట‌ల్స్‌లో ఇలాంటి స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాల‌నే పాటిస్తారు. అందుక‌నే మ‌నం హోట‌ల్స్‌కు వెళితే అద్భుత‌మైన సువాస‌న‌లు వ‌స్తాయి. ఇక ఇంటిని క్లీన్ చేసేందుకు ఎసెన్షియ‌ల్ ఆయిల్స్ కూడా ఎంతో ప‌నిచేస్తాయి.

follow these natural tips to clean your house

లెమ‌న్‌, లావెండ‌ర్‌, రోజ్‌, శాండ‌ల్‌వుడ్ వంటి ఎసెన్షియ‌ల్ ఆయిల్స్‌ను నీటిలో కొన్ని చుక్క‌లు వేసి ఆ నీటితో ఇంటిని క్లీన్ చేయాలి. దీంతో మీరు ఎంచుకున్న ఆయిల్‌ను బ‌ట్టి మీ ఇల్లు సువాస‌న‌భ‌రితంగా మారుతుంది. అలాగే బేకింగ్ సోడాతోనూ ఇంటిని చ‌క్క‌గా క్లీన్ చేయ‌వ‌చ్చు. మీరు క్లీనింగ్‌కు వాడే నీటిలో కాస్త బేకింగ్ సోడా వేసి క్లీన్ చేస్తే ఇల్లు త‌ళ‌త‌ళా మెరిసిపోతుంది. ఎలాంటి వాస‌న అయినా స‌రే మాయ‌మ‌వుతుంది. ల‌వంగాల నీళ్లు, దాల్చిన చెక్క నీళ్లు వంటి వాటిని ఇంటిని శుభ్రం చేసే నీటిలో క‌లిపి ఆ నీటితో ఇంటిని క్లీన్ చేయాలి. దీంతో ఇల్లు సువాస‌న‌ల‌ను వెద‌జ‌ల్లుతుంది. మీరు ఆ వాస‌న‌ల‌కు మైమ‌రిచిపోతారు. ఇలా ఈ చిట్కాల‌ను పాటించి మీ ఇంటిని సువాస‌న భ‌రితంగా మార్చుకోవ‌చ్చు.

Admin

Recent Posts