Throat Pain : ఇలా చేస్తే.. చిటికెలో గొంతు నొప్పి మాయం..!

Throat Pain : సీజన్‌ మారినప్పుడల్లా సహజంగానే చాలా మందికి సీజనల్‌ వ్యాధులు వస్తుంటాయి. తరచూ గొంతు నొప్పి, గొంతులో గరగరగా ఉండడం, దగ్గు, జలుబు వంటి సమస్యలు వస్తుంటాయి. చలి ఇంకా పెరుగుతున్న కొద్దీ ఈ సమస్యలు ఇంకా ఎక్కువవుతాయి. అయితే కింద తెలిపిన చిట్కాలను పాటిస్తే గొంతు నొప్పితోపాటు ఈ సీజన్‌లో వచ్చే సమస్యలకు చెక్‌ పెట్టవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటంటే..

follow these remedies to get rid of Throat Pain

1. ఈ సీజన్‌లో చల్లగా ఉన్నవి కాకుండా వేడిగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. వేడిగా ఉన్న అన్నం తినాలి. అలాగే వేడి ద్రవాహారాలను ఎక్కువగా తీసుకోవాలి. ముఖ్యంగా సూప్స్, హెర్బల్‌ టీలను బాగా తాగాలి. వాటిల్లో ఉండే ఔషధ గుణాలు గొంతు నొప్పిని తగ్గిస్తాయి. శ్వాస సరిగ్గా ఆడేలా చేస్తాయి.

2. రోజూ ఉదయాన్నే పరగడుపునే రెండు పచ్చి వెల్లుల్లి రెబ్బలను దంచి కొద్దిగా తేనె కలిపి తింటుండాలి. దీని వల్ల బాక్టీరియా, వైరస్‌ ఇన్‌ఫెక్షన్ల నుంచి బయట పడవచ్చు. ముఖ్యంగా గొంతు నొప్పి తగ్గుతుంది.

3. గొంతు సమస్యలు ఉన్నవారు రాత్రి పూట ఒక గ్లాస్‌ గోరు వెచ్చని పాలలో కొద్దిగా మిరియాల పొడి లేదా పసుపు కలిపి తాగితే సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.

4. తరచూ ఉప్పు నీటితో గొంతును శుభ్రం చేసుకోవాలి. గొంతులో ఆ నీళ్లను పోసి పుక్కిలించాలి. దీని వల్ల ఇన్‌ఫెక్షన్‌ తగ్గుతుంది.

5. ఒక గ్లాస్‌ నీటిలో కొన్ని తులసి ఆకులను వేసి మరిగించాలి. అనంతరం ఆ నీటిలో కొద్దిగా నిమ్మరసం, తేనెలను వేసి తాగాలి. ఇలా రోజుకు రెండు సార్లు చేస్తే గొంతు నొప్పి తగ్గుతుంది.

6. ఒక టీస్పూన్‌ మిరియాల పొడి, రెండు టీస్పూన్ల తేనె కలిపి రోజుకు మూడు సార్లు తీసుకోవాలి. దీని వల్ల కూడా గొంతు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

Editor

Recent Posts