Couples : శృంగార సామర్థ్యం పెరిగి.. యాక్టివ్‌గా పాల్గొనాలంటే.. వీటిని దంపతులు రోజూ తీసుకోవాలి..!

Couples : నిత్యం ఉరుకుల పరుగుల బిజీ జీవితంలో ప్రస్తుతం మనిషి యాంత్రిక జీవితం గడుపుతున్నాడు. దీంతో ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు వెంటాడుతున్నాయి. ఫలితంగా అది దంపతుల శృంగార జీవితంపై కూడా ప్రభావాన్ని చూపిస్తోంది. అయితే భార్యాభర్తలు వారానికి కనీసం రెండు లేదా మూడు సార్లు అయినా సరే శృంగారంలో పాల్గొనాలని, దీంతో మానసిక సమస్యల నుంచి రిలీఫ్‌ వస్తుందని, అలాగే దాంపత్య జీవితం కూడా బాగుంటుందని.. ఇప్పటికే ఎంతో మంది పరిశోధకులు తేల్చి చెప్పారు. అందువల్ల దంపతులు కచ్చితంగా శృంగారంలో తరచూ పాల్గొంటుండాలి.

Couples take these foods daily to actively participate in srungaram

అయితే కొందరు మాత్రం తమకు అలసటగా ఉందని, నీరసం ఉందని, శక్తి లేదని, ఉత్సాహం, ఆసక్తి ఏమాత్రం లేవని చెబుతుంటారు. కానీ అలాంటి వారు కింద తెలిపిన ఆహారాలను రోజూ తీసుకుంటుండాలి. దీంతో వారిలో కొత్త శక్తి వస్తుంది. యాక్టివ్‌గా మారుతారు. శృంగారంలో పాల్గొనాలనే ఉత్సాహం ఏర్పడుతుంది. శృంగార సామర్థ్యం కూడా పెరుగుతుంది. మరి దంపతులు శృంగారం కోసం రోజూ తీసుకోవాల్సిన ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. పాలకూరలో అనేక యాంటీ ఆక్సిడెంట్లు, సమ్మేళనాలు ఉంటాయి. ఇవి వాపులను తగ్గిస్తాయి. దీంతో శరీర భాగాలకు రక్త సరఫరా మెరుగు పడుతుంది. ముఖ్యంగా జననావయవాలకు రక్త సరఫరా మెరుగు పడుతుంది. శృంగార కాంక్ష కలుగుతుంది. దీంతో శృంగారంలో ఉత్సాహంగా పాల్గొంటారు. కనుక దంపతులు పాలకూరను తరచూ తింటుండాలి.

2. గ్రీన్‌ టీలో కాటెకిన్స్‌ అనబడే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి నైట్రిక్‌ ఆక్సైడ్‌ ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి. దీని వల్ల జననావయవాలకు రక్త సరఫరా మెరుగు పడుతుంది. యాక్టివ్‌గా మారుతారు. శృంగారంలో ఉత్సాహంగా పాల్గొంటారు. అందువల్ల దంపతులు రోజూ రెండు కప్పుల గ్రీన్‌ టీని తాగితే మంచిది.

3. రోజూ ఒక పెగ్‌ రెడ్‌ వైన్‌ను తాగితే గుండెకు ఎంతగానో మంచిదని ఇప్పటికే వైద్య నిపుణులు చెప్పారు. రెడ్‌ వైన్‌ తాగడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగు పడడమే కాదు, శృంగారం చేయాలనే కాంక్ష కూడా పెరుగుతుంది.

4. చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. అందువల్ల వీటిని ఆహారంలో భాగం చేసుకుంటే శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. శృంగార వాంఛలు పెరుగుతాయి.

5. జీడిపప్పు, బాదంపప్పు, వాల్‌ నట్స్‌ను నిత్యం గుప్పెడు మోతాదులో తింటుండాలి. ఇవి మనస్సును ప్రశాంతంగా ఉంచుతాయి. మానసిక ఒత్తిడి, ఆందోళనలు తగ్గేలా చేస్తాయి. దీంతో మనస్సు ప్రశాంతంగా మారుతుంది. శృంగారం చేయాలనే ఆసక్తిని రేకెత్తిస్తాయి. అలాగే శృంగార సామర్థ్యాన్ని కూడా పెంచుతాయి.

6. రోజూ రాత్రి పూట ఒక గ్లాస్‌ గోరు వెచ్చని పాలలో ఒక టీస్పూన్‌ అశ్వగంధ పొడిని కలుపుకుని తాగితే స్త్రీ, పురుషులిద్దరిలోనూ శృంగార సామర్థ్యం అమాంతం పెరుగుతుంది. ఆ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొంటారు.

Editor

Recent Posts