Sleep : రోజూ మీకు నిద్ర స‌రిగ్గా ప‌ట్ట‌డం లేదా.. అయితే ఈ వాస్తు ప‌రిహారాల‌ను పాటించండి..

Sleep : ప్ర‌స్తుతం న‌డుస్తున్న‌ది టెక్నాల‌జీ యుగం. అంతా ఉరుకుల ప‌రుగుల బిజీ జీవితం అయిపోయింది. దీంతో అన్నీ చెడు అల‌వాట్లను నేర్చుకుంటున్నారు. పైగా జంక్ ఫుడ్ తిన‌డం, శారీర‌క శ్ర‌మ చేయ‌క‌పోవ‌డం వంటివి చేస్తున్నారు. దీంతో అనారోగ్యాల‌ను కోరి తెచ్చుకున్న‌ట్లు అవుతోంది. పైగా అనేక కార‌ణాల వ‌ల్ల చాలా మంది నిత్యం ఒత్తిడి, ఆందోళ‌న‌తో స‌త‌మ‌తం అవుతున్నారు. ఇవి ఉండడం వ‌ల్ల రాత్రిపూట చాలా మందికి నిద్ర కూడా స‌రిగ్గా ప‌ట్ట‌డం లేదు. ప్రస్తుతం చాలా మంది నిద్ర‌లేమి స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. రాత్రి బెడ్ మీద త్వ‌ర‌గా ప‌డుకున్న‌ప్ప‌టికీ చాలా మందికి అస‌లు రాత్రి 1 గంట వ‌ర‌కు నిద్ర ప‌ట్ట‌డం లేదు.

అయితే నిద్ర ప‌ట్ట‌క‌పోతే చాలా మంది ఇంగ్లిష్ మెడిసిన్ల‌ను వాడుతుంటారు. ఇవి వాడితే త్వ‌ర‌గా నిద్ర ప‌డుతుంది. కానీ దీర్ఘ‌కాలికంగా వీటిని వాడడం అంత మంచిది కాదు. క‌నుక స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాల‌ను పాటించాలి. అయితే కొన్నిసార్లు మ‌న నిద్ర‌లేమికి వాస్తు దోషం కూడా కార‌ణ‌మ‌వుతుంది. వాస్తు దోషం గ‌న‌క ఉంటే నిద్ర ప‌ట్ట‌దు. ఇక అందుకు వాస్తు శాస్త్రంలో ఎలాంటి ప‌రిహారాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

follow these vastu remedies for good night of sleep
Sleep

ఎల‌క్ట్రానిక్ వ‌స్తువులు..

చాలా మంది నిద్ర‌పోయేట‌ప్పుడు బెడ్ ప‌క్క‌న ఫోన్లు, వాచ్‌లు లేదా ఇత‌ర ఎల‌క్ట్రానిక్ వ‌స్తువుల‌ను పెట్టుకుంటారు. అలా పెట్టుకోవ‌డం మంచిది కాదు. ఇవి విద్యుత్ అయ‌స్కాంత త‌త్వాన్ని క‌లిగి ఉంటాయి. అయ‌స్కాంత క్షేత్రాన్ని వెద‌జ‌ల్లుతాయి. దీంతో మ‌న‌కు నిద్ర స‌రిగ్గా ప‌ట్ట‌దు. ఇది మ‌న చుట్టూ ఉండే పాజిటివ్ ఎన‌ర్జీని సైతం దెబ్బ తీస్తుంది. దీని వ‌ల్ల మ‌న నిద్ర‌కు భంగం క‌లుగుతుంది. క‌నుక బెడ్ పక్క‌న ఫోన్ల‌ను పెట్ట‌కండి.

ఇక మీరు ప‌డుకునే బెడ్‌రూమ్‌లో ఈశాన్య దిశ‌లో ఒక పాత్ర‌లో 81 క్రిస్ట‌ల్ పూస‌ల‌ను వేసి ఉంచండి. ఇవి నెగెటివ్ ఎన‌ర్జీని పోగొట్టి గ‌దిలో పాజిటివ్ ఎన‌ర్జీని, వైబ్రేష‌న్స్‌ను పెంచుతాయి. దీంతో మీకు ప‌డుకున్న వెంట‌నే గాఢంగా నిద్ర ప‌డుతుంది. అలాగే మీరు ప‌డుకునేట‌ప్పుడు దిండు కింద బిర్యానీ ఆకు ఒక‌టి లేదా గోమ‌తి చ‌క్రాల‌ను పెట్టుకోండి. ఇవి కూడా నెగెటివ్ ఎన‌ర్జీని తొల‌గిస్తాయి. పాజిటివ్ ఎన‌ర్జీని పెంచుతాయి. దీంతో మీకు నిద్ర చ‌క్క‌గా ప‌డుతుంది. వాస్తు దోషాల‌ను ఇవి పోగొడ‌తాయి.

మొక్క‌లు..

అలాగే ప‌డుకునే ముందు మీకు ఇష్ట‌మైన సంగీతాన్ని విన‌వచ్చ‌. దీంతోపాటు రుద్రాక్ష‌లు లేదా క్రిస్ట‌ల్స్‌తో కూడిన బ్రేస్‌లెట్స్‌ను ధ‌రించ‌వ‌చ్చు. మీ ఇంట్లో గాలిని శుద్ధి చేసే మొక్క‌ల‌ను పెంచ‌వ‌చ్చు. ఇవి కూడా మీ ఇంట్లో పాజిటివ్ ఎన‌ర్జీని పెంచుతాయి. మీకు నిద్ర వ‌చ్చేలా చేస్తాయి. వాస్తు దోషాల‌ను పోగొడ‌తాయి. ఈ విధంగా ప‌లు పరిహారాల‌ను పాటించ‌డం వల్ల వాస్తు దోషాలు పోయి మీకు నిద్ర స‌రిగ్గా ప‌డుతుంది. నిద్ర‌లేమి స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

Editor

Recent Posts