Mosquitoes : దోమలు.. ఇవి మనల్ని ఎంతగానో ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కాలంతో సంబంధం లేకుండా ఇవి ప్రతి నిత్యం మనల్ని ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాయి. దోమ కాటుకు గురి అవ్వడం వల్ల మనం ఎన్నో అనారోగ్య సమస్యల బారిన పడుతూ ఉంటాం. చికెన్ గున్యా, డెంగ్యూ, మలేరియా వంటి విష జ్వరాల బారిన పడుతూ ఉంటారు. ఒక్కోసారి ఈ జ్వరాలు ప్రాణాంతకంగా కూడా మారుతూ ఉంటాయి. వీటి ఉధృతిని తగ్గించుకోవడానికి చాలా మంది రిఫిల్స్ ను, కాయిల్స్ ను, దోమల బత్తీలను ఉపయోగిస్తూ ఉంటారు. వీటిని వాడడం వల్ల మనం ఇతర అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. వీటిలో రసాయనాలను ఎక్కువగా వాడుతూ ఉంటారు.
దీంతో శ్వాస సంబంధిత సమస్యలు, ముక్కు నుండి నీళ్లు కారడం, తలనొప్పి, దగ్గు వంటి శ్వాస సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కనుక వీటిని వాడకపోవడమే మంచిది. సహజ సిద్ద చిట్కాను ఉపయోగించి మనం చాలా సులభంగా దోమలను తరిమివేయవచ్చు. ఈ చిట్కాను వాడడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. అలాగే ఈ చిట్కాను వాడడం చాలా సులభం. దోమలను తరిమి వేసే ఈ చిట్కా ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ మనం వేపాకును, కంప్యూటర్ సామ్రాన్ని కడ్డీని ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక కప్పు లేదా స్టీల్ గ్లాస్ లేదా గిన్నెను తీసుకోవాలి. తరువాత సామ్రానిని వెలిగించి పొగ వచ్చేలా చేసుకోవాలి.
తరువాత ఈ సామ్రాని కడ్డీని కప్పులో ఉంచాలి. తరువాత దానిపై వేపాకును ఉంచాలి. వేపాకు పచ్చిగా ఉన్నప్పటికి దాని నుండి చేదు వాసన వస్తుంది. ఇలా వేపాకు వేసి సామ్రాని కడ్డీని గదిలో ఒక మూలన ఉంచాలి. దీని నుండి వచ్చే వాసనకు దోమలు పారిపోతాయి. వేపాకు అందుబాటులో లేని వారు వేపాకుకు బదులుగా ఎండిన వెల్లుల్లి పొట్టును వేసుకోవాలి. వెల్లుల్లి పొట్టు నుండి వచ్చే వాసన కారణంగా కూడా దోమలు పారిపోతాయి. ఈ విధంగా ఈ చిట్కాలను పాటించడం వల్ల మనం చాలా సులభంగా దోమలను తరిమివేయవచ్చు. వేపాకు, వెల్లుల్లిని వాడడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. పిల్లలకు, పెద్దలకు ఎటువంటి హాని కలగకుండా ఉంటుంది. అలాగే దోమలు కూడా పారిపోతాయి.