Veg Diwani Handi : వెజ్ దివాని హండి.. ఇలా చేసి తినండి.. రైస్‌, పులావ్‌, చ‌పాతీల్లోకి బాగుంటుంది..!

Veg Diwani Handi : మ‌న‌కు రెస్టారెంట్ ల‌ల్లో ల‌భించే వెజ్ వెరైటీస్ లో వెజ్ దివానీ హండి కూడా ఒక‌టి. కూర‌గాయ‌ల‌తో చేసే ఈ వంట‌కం చాలా రుచిగా ఉంటుంది. దీనిని మ‌న‌లో చాలా మంది రుచి చూసే ఉంటారు. అన్నం, రోటి, చ‌పాతీ ఇలా దేనిలోకైనా ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. ఈ వెజ్ దివానీ హండినీ మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డం చాలా తేలిక‌. రుచిగా, సుల‌భంగా, అచ్చం రెస్టారెంట్ ల‌లో ల‌భించే విధంగా వెజ్ దివానీ హండినీ ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

వెజ్ దివానీ హండి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

త‌రిగిన బీన్స్ – 10, త‌రిగిన బంగాళాదుంప‌లు – 1, త‌రిగిన క్యారెట్ – 1, ప‌చ్చి బ‌ఠాణీ – 2 టేబుల్ స్పూన్స్, పొడుగ్గా త‌రిగిన టమాటాలు – 3, స‌న్న‌గా పొడుగ్గా త‌రిగిన ఉల్లిపాయలు – 3, చిన్న‌గా త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, అల్లం – రెండు ఇంచుల ముక్క, వెల్లుల్లి రెబ్బ‌లు – 8, బిర్యానీ ఆకులు – 2, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, ల‌వంగాలు – 3, యాల‌కులు – 3, జీడిప‌ప్పు -2 టేబుల్ స్పూన్స్, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, జీల‌క‌ర్ర పొడి – అర టీ స్పూన్, గ‌రం మ‌సాలా – ఒక టీ స్పూన్,కారం – ఒక టేబుల్ స్పూన్, ప‌సుపు – అర టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, నూనె – 2 టేబుల్ స్పూన్స్, క‌సూరి మెంతి – ఒక టీ స్పూన్, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, కొత్తిమీర – కొద్దిగా, ఫ్రెష్ క్రీమ్ – ఒక టేబుల్ స్పూన్.

Veg Diwani Handi recipe in telugu make in this method
Veg Diwani Handi

వెజ్ దివానీ హండి త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ఉల్లిపాయ‌లు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు స‌గానికి పైగా వేగిన త‌రువాత జీడిప‌ప్పు వేసి వేయించాలి. వీటిని ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత అదే నూనెలో ట‌మాట ముక్క‌లు, అల్లం, వెల్లుల్లి, ప‌చ్చ‌మిర్చి వేసి క‌ల‌పాలి. త‌రువాత వీటిపై మూత పెట్టి ట‌మాట ముక్క‌లు మెత్త‌గా అయ్యే వ‌ర‌కు వేయించాలి. ట‌మాట ముక్క‌లు మెత్త‌గా ఉడికిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి పూర్తిగా చ‌ల్లార‌నివ్వాలి. త‌రువాత వీటిని ఒక జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే వేయించిన ఉల్లిపాయ ముక్క‌లు, జీడిపప్పు వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకుని ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత ఒక గిన్నెలో అర లీట‌ర్ నీళ్లు పోసి వేడి చేయాలి. ఇందులో బ‌ఠాణీల‌తో పాటు కూర‌గాయ‌ల ముక్క‌ల‌న్నింటిని వేసి ప‌ది నిమిషాల పాటు ఉడికించాలి. ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి.

నూనె వేడ‌య్యాక మ‌సాలా దినుసులు, ప‌చ్చిమిర్చి వేసి వేయించాలి. త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న మ‌సాలా పేస్ట్, ఉప్పు, ప‌సుపు, కారం, గ‌రం మ‌సాలా, జీల‌క‌ర్ర పొడి, ధ‌నియాల పొడి వేసి క‌ల‌పాలి. త‌రువాత ఈ మిశ్ర‌మాన్ని నూనె పైకి తేలే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత ఉడికించిన కూర‌గాయ ముక్క‌లను నీటితో స‌హా వేసి క‌ల‌పాలి. ఇప్పుడు వీటిపై మూత పెట్టి 15 నిమిషాల పాటు మ‌ధ్య‌స్థ మంట‌పై ఉడికించాలి. త‌రువాత కొత్తిమీర‌, క‌సూరి మెంతి, క్రీమ్ వేసి క‌ల‌పాలి. దీనిని మ‌రో నిమిషం పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే వెజ్ దివానీ హండీ త‌యార‌వుతుంది. దీనిని అన్నం, చ‌పాతీ, పుల్కా, నాన్, పులావ్, బిర్యానీ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇందులో ప‌న్నీర్, మ‌ష్రూమ్స్ వంటి వాటిని కూడా వేసుకోవ‌చ్చు. ఈ వెజ్ దివానీ క‌ర్రీని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts