Junnu : ఎగ్స్‌, మిల్క్ పౌడ‌ర్ లేకుండా ఎంతో రుచిక‌ర‌మైన జున్నును ఇలా కొన్ని నిమిషాల్లోనే చేసుకోవ‌చ్చు..!

Junnu : జున్ను.. దీనిని ఇష్ట‌ప‌డ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. స‌రిగ్గా చేయాలే కానీ జున్ను చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఎంతో ఇష్టంగా తింటారు. జున్నును తిన‌డం వ‌ల్ల మ‌నం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చు. జున్ను పాల‌తో అవ‌స‌రం లేకుండానే మ‌నం జున్నును త‌యారు చేసుకోవ‌చ్చు. మ‌న‌కు మార్కెట్ లో జున్ను పాల పొడి విరివిరిగా ల‌భ్య‌మ‌వుతుంది. ఈ పొడితో చేసే జున్ను కూడా జున్ను పాల‌తో చేసే జున్ను రుచినే క‌లిగి ఉంటుంది. జున్ను పాలు, కోడిగుడ్లు అవ‌స‌రం లేకుండా జున్ను పొడితో రుచిగా ఎలా జున్నును త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

జున్ను త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

చిక్క‌టి పాలు – అర లీట‌ర్, బెల్లం తురుము – 150గ్రా., జున్ను పౌడ‌ర్ – 100 గ్రా.యాల‌కుల పొడి – పావు టీ స్పూన్, మిరియాల పొడి – పావు టీ స్పూన్.

make junnu in this method very tasty
Junnu

జున్ను త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో పాలను తీసుకోవాలి. త‌రువాత ఇందులో బెల్లం తురుము, జున్ను పౌడ‌ర్ వేసి బెల్లం క‌రిగే వ‌ర‌కు తిప్పాలి. త‌రువాత యాల‌కుల పొడి, మిరియాల పొడి వేసి క‌ల‌పాలి. ఇప్పుడు ఇడ్లీ పాత్ర‌లో ఒక గ్లాస్ నీళ్ల‌ను పోయాలి. త‌రువాత ఇందులో స్టాండ్ ను ఉంచి దానిపై ముందుగా సిద్దం చేసుకున్న జున్ను పాల గిన్నెను ఉంచాలి. త‌రువాత ఆవిరి జున్నులో ప‌డ‌కుండా గిన్నెపై మూత‌ను ఉంచాలి. ఇప్పుడు ఇడ్లీ కుక్క‌ర్ పై మూత‌ను ఉంచి వేడి చేయాలి. ఈ జున్నును 20 నిమిషాల పాటు మ‌ధ్య‌స్థ మంట‌పై ఉడికించాలి. త‌రువాత మూత తీసి జున్నులో చాకును గుచ్చి చూడాలి. చాకుకు పాలు అంటుకోకుండా ఉంటే జున్ను త‌యారైందిగా భావించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి లేదా మ‌రో 5 నిమిషాల పాటు ఉడికించాలి.

ఇప్పుడు జున్ను గిన్నెను ఫ్రిజ్ లో రెండు గంట‌ల పాటు ఉంచాలి. త‌రువాత జున్నును నెమ్మ‌దిగా గిన్నె నుండి వేరు చేసి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఫ్రిజ్ లో పెట్ట‌కూడ‌దు అనుకున్న వారు జున్ను చ‌ల్లారిన త‌రువాత గిన్నె నుండి వేరు చేసి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే జున్ను త‌యార‌వుతుంది. ఈ జున్నును అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. ఈ విధంగా మ‌న‌కు అప్పుడు కావ‌లిస్తే అప్పుడు రుచిగా, సుల‌భంగా జున్నును త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఈ జున్నును తిన‌డం వ‌ల్ల మ‌నం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చు.

D

Recent Posts