technology

ఈ ఫోన్ ధ‌ర‌పై ఏకంగా రూ.5వేల డిస్కౌంట్‌.. త్వ‌ర ప‌డండి..!

బడ్జెట్ లో మంచి మొబైల్స్ ను కొనుగోలు చేయాలంటే సామ్సంగ్ గెలాక్సీ ఏ14 5జి మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం భారీ డిస్కౌంట్ల లో సామ్సంగ్ గెలాక్సీ ఏ14 5జి మోడల్ ఫ్లిప్కార్ట్ లో అందుబాటులో ఉంది. ఒకవేళ మీరు కొత్త స్మార్ట్ ఫోన్ ను ఈ పండుగకు కొనుక్కోవాలి అనుకుంటే ఇదే సరైన సమయం అని చెప్పవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ ఎంతో తక్కువ ధరలో ఉంది. పైగా దీనిలో ఎన్నో మంచి ఫీచర్స్ ఉన్నాయి, బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇదే మంచి ఆప్షన్ అని చాలామంది అంటున్నారు. అంతేకాక 5జి మోడల్స్ లో ఇదే బెస్ట్ సెల్లింగ్ ఫోన్ అని కంపెనీ చెబుతోంది.

మంచి క్వాలిటీలో తక్కువ ధరకే కొనుగోలు చేయాలంటే మీరు తప్పక ఈ స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేయాల్సిందే. సామ్సంగ్ గెలాక్సీ ఏ14 5జి అసలు ధర 15 వేలకు పైగా ఉంది. కాకపోతే దీని ధర దీపావలి సేల్స్ సందర్భంగా ఫ్లిప్కార్ట్ లో 10,000 కు మాత్రమే లభిస్తోంది. అంటే 35 శాతం డిస్కౌంట్ లో దీనిని పొందవచ్చు.

galaxy a14 now gets 5000 discount

ఒకవేళ మీ వద్ద ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉన్నట్లయితే అదనంగా ఐదు శాతం డిస్కౌంట్ ను పొందవచ్చు. ఇదే ఆఫర్ లో మీ పాత మొబైల్ ని కూడా ఎక్స్చేంజ్ చేసి ఎంతో తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. దీనిలో 8జీబీ ర్యామ్ 128జీబీ స్టోరేజ్ లభిస్తుంది. మెయిన్ కెమెరాకు 50 ఎంపీ మరియు ఫ్రంట్ కెమెరాకు 13 ఎంపీ ఉంది. ఈ ఫోన్ లో బ్యాటరీ కూడా 5000 ఎంఏహెచ్ వరకు ఉంది, అంటే రోజంతా దీనిని మీరు ఉపయోగించవచ్చు.

Peddinti Sravya

Recent Posts