Garlic Bread : బేక‌రీల‌లో ల‌భించే దీన్ని ఇంట్లోనే ఇలా చేసుకోవ‌చ్చు.. చాలా ఈజీ..!

Garlic Bread : మ‌నం మైదాపిండితో ర‌క‌ర‌కాల చిరుతిళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. మైదాపిండితో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన చిరుతిళ్ల‌ల్లో గార్లిక్ బ్రెడ్ కూడా ఒక‌టి. ఈగార్లిక్ బ్రెడ్ ను మ‌న‌లో చాలా మంది తినే ఉంటారు. మ‌న‌కు ఎక్కువ‌గా బేక‌రీల‌ల్లో, మెక్ డొనాల్డ్స్ వంటి వాటిలో ఈ బ్రెడ్ ల‌భిస్తూ ఉంటుంది. అయితే బ‌య‌ట తినే ప‌ని లేకుండా ఈ గార్లిక్ బ్రెడ్ ను అదే రుచితో మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డానికి ఇంట్లో ఒవెన్ ఉండాల్సిన అవ‌స‌రం కూడా లేదు. దీనిని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. ఒవెన్ తో ప‌ని లేకుండా ఇంట్లోనే గార్లిక్ బ్రెడ్ ను ఎలా త‌యారు చేసుకోవాలి..త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి..అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

గార్లిక్ బ్రెడ్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

గోరు వెచ్చ‌ని నీళ్లు – పావు క‌ప్పు, పంచ‌దార – 2 టీ స్పూన్స్, ఈస్ట్ – ఒక టీ స్పూన్, మైదాపిండి – 2 క‌ప్పులు, ఉప్పు – త‌గినంత‌, తాజా అల్లం పేస్ట్ – ఒక టీ స్పూన్, చీస్ – కొద్దిగా, వెల్లుల్లి త‌రుగు – అర టీ స్పూన్, ముక్క‌లుగా త‌రిగిన పండుమిర్చి – 1, ఒర‌గానో – పావు టీ స్పూన్, రెడ్ చిల్లీ ప్లేక్స్ – అర టీ స్పూన్, ఉడికించిన స్వీట్ కార్న్- ఒక టేబుల్ స్పూన్.

Garlic Bread recipe in telugu very easy to make
Garlic Bread

గార్లిక్ బ్రెడ్ త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో గోరు వెచ్చ‌ని నీటిని తీసుకోవాలి. త‌రువాత ఇందులో ఈస్ట్, పంచ‌దార వేసి క‌ల‌పాలి. దీనిపై మూత పెట్టి 10 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ప‌ది నిమిషాల త‌రువాత ఒక గిన్నెలో మైదాపిండిని తీసుకోవాలి. త‌రువాత ఇందులో ఉప్పు, అల్లం పేస్ట్ వేసి క‌ల‌పాలి. త‌రువాత ముందుగా త‌యారు చేసుకున్న పంచదార నీటిని వేసుకుంటూ చ‌పాతీ పిండిలా మెత్త‌గా క‌లుపుకోవాలి. త‌రువాత ఈ పిండిపై మూత పెట్టి గంట‌న్న‌ర పాటు అలాగే ఉంచాలి. గంట‌న్న‌ర త‌రువాత కుక్క‌ర్ ను తీసుకుని అందులో రెండు క‌ప్పుల ఉప్పు వేసుకుని స‌మానంగా చేసుకోవాలి. త‌రువాత ఇందులో స్టాండ్ ను ఉంచి కుక్క‌ర్ మూతకు ఉండే విజిల్, ర‌బ్బ‌ర్ తీసేసి మూత పెట్టి 10 నిమిషాల పాటు ఫ్రీహీట్ చేసుకోవాలి. త‌రువాత కుక్క‌ర్ ప‌రిమాణానికి త‌గిన‌ట్టు పిండిని తీసుకుని పొడి పిండి చ‌ల్లుకుంటూ మందంగా చ‌పాతీలా వత్తుకోవాలి. త‌రువాత దీనిపై ఒక వైపు మాత్ర‌మే తురిమిన చీజ్ ను వేసుకోవాలి. త‌రువాత ఈ చీజ్ పై వెల్లుల్లి తరుగు, పండుమిర్చి ముక్క‌లు వేసుకోవాలి.

త‌రువాత చిల్లీ ప్లేక్స్, ఒర‌గానో చ‌ల్లుకోవాలి. త‌రువాత ఉడికించిన కార్న్ ను వేసుకోవాలి. ఇప్పుడు అంచుల చుట్టూ నీటితో త‌డి చేసి మ‌ధ్య‌లోకి మ‌డిచి అంచుల‌ను కొద్దిగా వత్తాలి. త‌రువాత దీనిపై క‌రిగించిన బ‌ట‌ర్ ను రాయాలి. త‌రువాత మ‌రి కొద్దిగా వెల్లుల్లి త‌రుగును, చిల్లీ ప్లేక్స్ ను, ఒర‌గానోను పైన చ‌ల్లుకోవాలి. త‌రువాత చాకుతో గాట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ ను తీసుకుని దానిపై బ‌ట‌ర్ పేప‌ర్ ను ఉంచాలి. త‌రువాత దీనిపై ముందుగా త‌యారు చేసుకున్న బ్రెడ్ మిశ్ర‌మాన్ని ఉంచి ఫ్రీహీట్ చేసుకున్న‌ కుక్క‌ర్ లో పెట్టాలి. ఇప్పుడు దీనిపై మూత పెట్టి 15 నిమిషాల పాటు మ‌ధ్య‌స్థ మంట‌పై ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత మూత తీసి బ్రెడ్ ను బ‌య‌ట‌కు తీసి స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే గార్లిక్ బ్రెడ్ త‌యార‌వుతుంది. ఇలా ఇంట్లోనే ఒవెన్ లేక‌పోయిన‌ప్ప‌టికి చాలా సుల‌భంగా గార్లిక్ బ్రెడ్ ను తయారు చేసుకుని తిన‌వ‌చ్చు. దీనిని పిల్ల‌లు ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts