Genelia : తెలుగు తెర‌పై హాసిని సెకండ్ ఇన్నింగ్స్‌..!

Genelia : జెనీలియా.. తెలుగు ప్రేక్షకులకు ఈ పేరును పెద్దగా పరిచయం చేయాల్సిన పని లేదు. 2000వ సంవత్సర కాలంలో ఈమె నటించిన అనేక చిత్రాలు హిట్ అయ్యాయి. అప్పట్లో ఈమె సక్సెస్ కు కేరాఫ్ గా నిలిచింది. తరువాత హిందీ నటుడు రితేష్ దేశ్‌ ముఖ్ ను వివాహం చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పింది. అనంతరం ఈమె తెలుగు తెర‌కు పూర్తిగా దూర‌మైంది.

Genelia  came back to Tollywood after so many years
Genelia

అప్పట్లో జెనీలియా నటించిన అనేక చిత్రాలు హిట్ అయ్యాయి. బొమ్మరిల్లు, ఢీ, రెడీ వంటి చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. పెళ్లి అయ్యాక సినిమా రంగానికి చాలా కాలం పాటు దూరంగా ఉంది. మొన్నీ మధ్యనే మా ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానల్ కు ఓటు వేసేందుకు ఈమె ఏకంగా ముంబై నుంచి హైదరాబాద్ కు రాత్రికి రాత్రే వచ్చింది. ఇక ఇప్పుడు తాజాగా ఓ సినిమా వేడుకలో కనిపించి అలరించింది.

బ‌ళ్లారి కింగ్‌గా పిలువబ‌డే గాలి జ‌నార్ధ‌న్ రెడ్డి కుమారుడు గాలి కిరీటి సినిమా రంగానికి ప‌రిచ‌యం అవుతున్న విష‌యం విదిత‌మే. ఈ సినిమాలో పెళ్లి సంద‌డి బ్యూటీ శ్రీ‌లీల హీరోయిన్‌గా ఎంపికైంది. దీనికి రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించున్నారు. ఈ సినిమా లాంచింగ్ వేడుక తాజాగా హైద‌రాబాద్‌లో జ‌రిగింది. దీనికి జెనీలియా కూడా హాజ‌రైంది. ఈమె కూడా ఈ మూవీలో నటించ‌నుంద‌ని తెలుస్తోంది.

అయితే చాలా కాలం త‌రువాత జెనీలియా మ‌ళ్లీ సినిమా తెర‌కు ప‌రిచ‌యం అవుతూ త‌న సెకండ్ ఇన్నింగ్స్‌ను మొద‌లు పెడుతోంది. ఈ క్ర‌మంలోనే ఆమె త‌న‌కు ఎంతో సంతోషంగా ఉంద‌ని, చాలా కాలం త‌రువాత యంగ్ టీమ్‌తో ప‌నిచేస్తుండ‌డం ఆనందంగా ఉంద‌ని తెలిపింది. మ‌రి సెకండ్ ఇన్నింగ్స్‌లో ఈమె ఏవిధంగా ఆక‌ట్టుకుంటుందో చూడాలి.

Editor

Recent Posts