Malavika Mohanan : మళయాళ బ్యూటీ మాళవిక మోహనన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ భామ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు అందాలను ఆరబోస్తూ ఆ ఫొటోలను ఆమె షేర్ చేస్తుంటుంది. అయితే ఈమె సహజంగానే ఓ మోడల్ కనుక.. గ్లామర్ షోకు కొదువేమీ లేదు. ఈ క్రమంలోనే తన గ్లామర్‌తో ఈ భామ ఎంతో మంది ఫ్యాన్స్‌ను సంపాదించుకుంది. ఇక తెలుగులో ఈమె ఇంత వరకు ఒక్క సినిమాలోనూ చేయలేదు. కానీ తమిళంలో ఈమె నటించిన సినిమాలు హిట్ అయ్యాయి. ఈ క్రమంలోనే ఈమె తెలుగు తెరకు కూడా పరిచయం కావాలని ఎదురు చూస్తోంది. ఆ అవకాశం ప్రభాస్ సినిమాలో రాబోతుందని తెలుస్తోంది.
ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో ఓ మూవీ తెరకెక్కనుంది. కామెడీ ఎంటర్‌టైనర్ జోనర్‌లో రానున్న ఈ మూవీలో మొత్తం ముగ్గురు హీరోయిన్స్‌ను ఎంపిక చేయనున్నారట. వారిలో మాళవిక మోహనన్ కూడా ఉందని తెలుస్తోంది. ఈమెతో చిత్ర మేకర్స్ చర్చలు జరుపుతున్నారట. అన్నీ కుదిరితే ఈమె ఆ ముగ్గురు హీరోయిన్లలో ఒకరిగా ప్రభాస్ పక్కన నటించనుందని తెలుస్తోంది. అయితే దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం. ఇక ఈ మూవీని డీవీవీ దానయ్య నిర్మించనున్నారు.
కాగా ప్రభాస్ ప్రస్తుతం రాధే శ్యామ్ సినిమాలో నటించగా.. ఈ సినిమా ఈనెల 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది. దీంతోపాటు సలార్ అనే మరో సినిమాలోనూ ప్రభాస్ నటిస్తున్నాడు. అందులో శృతిహాసన్ నటిస్తోంది. అలాగే ఆది పురుష్ అనే మూవీలోనూ ప్రభాస్ నటించగా.. ఈ సినిమా గ్రాఫిక్స్ పనుల్లో ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయనున్నారు.