సాధారణంగా ఎయిర్ పోర్ట్స్ లో రాత్రి సమయం కూడా ఎంతో అందంగా కనబడతాయి. అయితే ప్రస్తుతం ఎయిర్ పోర్ట్ లో తీసిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది థాయిలాండ్ లో పుకెట్ ఎయిర్ పోర్ట్ లో తీసిన వీడియో. ఇది ఎంతో ఖాళీగా ఉన్న సమయంలో ఈ వీడియోను తీశారు.
పైగా ఈ సమయంలో ఎటువంటి విమానాలు అక్కడ లేవు. అయితే ప్రస్తుతం హాలోవీన్ మొదలవుతోంది. దీంతో ఈ వీడియో ప్రస్తుతం ఎంతో వైరల్ అవుతోంది. పైగా ఈ వీడియో ఎంతో భయంకరంగా కనిపించే విధంగా తీశారు. ఎంతో నిశ్శబ్దకరమైన వాతావరణంలో నెటిజెన్లను భయపెట్టే విధంగా ఉంది అని చెప్పవచ్చు.
సోషల్ మీడియాలో ట్రెండ్ లో ఉన్న ఈ వీడియో చూసి అందరు షాక్ అవుతున్నారు. విమానాలలో దెయ్యాలు ఉన్నాయని, ఎలాంటి స్పిరిట్స్ అయినా ఈ ఎయిర్ పోర్టులో తిరుగుతున్నాయా అని అంటున్నారు. ఈ వీడియోపై నెటిజెన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.