Ginger Garlic Soup : అల్లం, వెల్లుల్లితో సూప్‌ను ఇలా చేయండి.. ఎంతో ఆరోగ్య‌క‌రం..!

Ginger Garlic Soup : మ‌నం వంట‌ల్లో అల్లం వెల్లుల్లిని విరివిగా వాడుతూ ఉంటాము. ఇవి రెండు కూడా ఎన్నో ఔష‌ధ గుణాలు, ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు క‌లిగి ఉన్నాయి. వంట‌ల్లో వాడ‌డంతో పాటుగా అల్లం వెల్లుల్లితో మ‌నం ఎంతో రుచిగా ఉండే సూప్ ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. జ‌లుబు, ద‌గ్గు, జ్వ‌రం, ఫ్లూ ల‌క్ష‌ణాల‌తో బాధ‌ప‌డుతున్న‌ప్పుడు ఈ సూప్ ను త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల చ‌క్క‌టి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. వాతావ‌ర‌ణం చ‌ల్ల‌గా ఉన్న‌ప్పుడు ఈ సూప్ ను త‌యారు చేసుకుని వేడి వేడిగా తాగితే ఎంతో హాయిగా ఉంటుంది. ఈ సూప్ ను త‌యారు చేసుకోవ‌డం చాలా సుల‌భం. అలాగే 10 నిమిషాల్లోనే దీనిని త‌యారు చేసుకోవ‌చ్చు. ఘాటుగా, రుచిగా, వేడి వేడిగా అల్లం వెల్లుల్లితో సూప్ ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

అల్లం వెల్లుల్లి సూప్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

వెల్లుల్లి రెబ్బ‌లు – 8, అల్లం – అర ఇంచు ముక్క‌, నెయ్యి – అర టీ స్పూన్, చిన్న‌గా త‌రిగిన క్యారెట్ ముక్క‌లు – ఒక టేబుల్ స్పూన్, నీళ్లు – ఒక‌టిన్న‌ర గ్లాస్, మిరియాలు – అర టీ స్పూన్, కార్న్ ఫ్లోర్ – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Ginger Garlic Soup recipe in telugu very healthy how to make it
Ginger Garlic Soup

అల్లం వెల్లుల్లి సూప్ త‌యారీ విధానం..

ముందుగా రోట్లో వెల్లుల్లి రెబ్బ‌లు, అల్లం వేసి క‌చ్చా ప‌చ్చాగా దంచుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత అదే రోట్లో మిరియాలు కూడా వేసి క‌చ్చా ప‌చ్చాగా దంచుకుని ప‌క్కకు ఉంచాలి. త‌రువాత గిన్నెలో కార్న్ ఫ్లోర్ ను తీసుకుని అందులో నీళ్లు పోసి ఉండలు లేకుండా క‌లుపుకుని ప‌క్కకు ఉంచాలి. ఇప్పుడు క‌ళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి క‌రిగిన త‌రువాత దంచిన అల్లం వెల్లుల్లి వేసి చిన్న మంట‌పై 2 నిమిషాల పాటు వేయించాలి.

త‌రువాత క్యారెట్ ముక్క‌లు వేసి వేయించాలి. వీటిని మ‌రో రెండు నిమిషాల పాటు వేయించిన త‌రువాత నీళ్లు, ఉప్పు, మిరియాలు వేసి క‌ల‌పాలి. వీటిని 5 నిమిషాల పాటు మ‌రిగించిన త‌రువాత కార్న్ ఫ్లోర్ నీళ్లు వేసి క‌ల‌పాలి. త‌రువాత ఈ సూప్ ను మ‌రో 3 నిమిషాల పాటు మ‌రిగించి, కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే అల్లం వెల్లుల్లి సూప్ త‌యార‌వుతుంది. దీనిని వేడి వేడిగా తాగితే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా అల్లం వెల్లుల్లితో సూప్ ను త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు.

D

Recent Posts