వినోదం

Indra Movie : చిరంజీవి ఇంద్ర సినిమాలో ఈ త‌ప్పుని గ‌మ‌నించారా..!

Indra Movie : మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఎన్నో సూప‌ర్ హిట్ చిత్రాలు రూపొందాయి. వాటిలో ఇంద్ర చిత్రం కూడా ఒక‌టి. బి.గోపాల్ దర్శకత్వంలో అశ్వనీదత్ నిర్మాణంలో తెరకెక్కిన ‘ఇంద్ర’ సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ సినిమా విడుదలై 20 యేళ్లు పైన అవుతున్న ఇప్పటికీ ఈ సినిమాకు సంబంధించిన ఏదో ఒక ముచ్చట వార్తల్లో నిలుస్తూనే ఉంటోంది. ఇంద్ర సినిమాలో సోనాలీబింద్రె, ఆర్తి అగర్వాల్‌ హీరోయిన్లుగా నటించారు. ఫ్యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయం అందుకుంది. అప్పట్లో ఈ చిత్రం సృష్టించిన రికార్డులకు హద్దే లేదు. బాక్సాఫీస్ దగ్గర చెలరేగిపోయాడు మెగాస్టార్. తన కెరీర్‌లో తొలిసారి నటించిన ఫ్యాక్షన్ సినిమా ఇది.

ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా కంటే ముందు చిరంజీవి హీరోగా వ‌చ్చిన మృగ‌రాజు సినిమా ఫ్లాప్ అయింది. ఈ సినిమా కంటే ముందు చిరు హీరోగా డాడీ సినిమా వ‌చ్చింది. సురేష్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ సినిమా కూడా డిజాస్ట‌ర్ గా నిలిచింది. అయితే ఇంద్ర సినిమా మాత్రం ఎన్నో రికార్డుల‌ని చెరిపేసింది. అప్పటి వరకు రాయలసీమ నేపథ్యంలో ఒక్క సినిమా కూడా చేయని చిరంజీవి.. తన కోసం ప్రత్యేకంగా ముచ్చటపడి మరీ ఇంద్ర కథను సిద్ధం చేయించుకున్నాడు. . చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. ఇంద్ర సెకండాఫ్‌లో చాలా సన్నివేశాలు చిరంజీవి స్వయంగా డైరెక్ట్ చేసాడు. ఈ విషయం కూడా ఎవరో చెప్పలేదు.. ఆ చిత్ర దర్శకుడు బి గోపాల్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

have you observed this mistake in indra movie

ఇంద్ర చిత్రంలో ఓ తొప్పు దొర్లింది. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా అని మెగాస్టార్ చెప్పిన డైలాగ్….ఆయ‌న మ్యాన‌రిజం థియేట‌ర్ లో క్లాప్స్ కొట్టించాయి. అయితే ఈ సినిమాలో ద‌ర్శ‌కుడు చిన్న త‌ప్పు చేశాడు. సినిమాలో హోలీ పండుగ జ‌రుగుతుంది. అయితే అదేరోజు సినిమాలో చిరంజీవి సిస్ట‌ర్స్ వ‌చ్చి రాఖీ క‌డ‌తారు. అలా రెండు పండుగ‌ల‌ను ఒకే రోజు చూపించి ద‌ర్శ‌కుడు మిస్టేక్ చేశాడు. ఈ విషయం త‌ర్వ‌త గుర్తించిన నెటిజ‌న్స్ తెగ ట్రోల్స్ చేశారు.

Admin

Recent Posts