వినోదం

Balakrishna : బాల‌య్య చెప్పిన ఈ టిప్స్ పాటిస్తే కోపాన్ని కంట్రోల్ చేసుకోవ‌చ్చ‌ట‌..!

Balakrishna : నంద‌మూరి బాల‌కృష్ణ ఇటీవ‌ల సినిమాల‌తో పాటు ఓటీటీ వేదిక‌గా ప్ర‌సారం అవుతున్న అన్‌స్టాపబుల్ షోతో అలరిస్తున్న విష‌యం తెలిసిందే. అన్‌స్టాపుబ‌ల్ షో తొలి సీజ‌న్ కి మంచి రెస్పాన్స్ రాగా, ఇటీవ‌ల ఇంకో సీజ‌న్ ప్రారంభం అయింది. గెస్ట్‌గా సీఎం చంద్ర‌బాబు నాయుడు హాజ‌రయ్యారు.

అయితే ఈ షో ద్వారా బాల‌య్య‌లోని కొత్త యాంగిల్ బ‌య‌ట‌ప‌డింది. అత‌ని చిలిపిత‌నం చూసి ప్ర‌తి ఒక్క‌రు ఆశ్చ‌ర్య‌పోయారు. మొన్న‌టి వ‌ర‌కు బాలయ్య అంటే చాలా కోపోద్రిక్తుడ‌ని త‌న‌ని విసిగించిన వారికి షాకింగ్ ట్రీట్‌మెంట్ ఇస్తాడ‌ని అనుకున్నారు. కాని అన్‌స్టాప‌బుల్ షోలో బాలయ్య చేసే సంద‌డి చూసి అంద‌రు ఆశ్చ‌ర్య‌పోయారు. అత‌డిది నిజంగా చిన్న పిల్లాడి మ‌న‌స్త‌త్వ‌మే అని కొంద‌రు రివ్యూలు ఇస్తున్నారు. అయితే కోపదాటి మ‌నిషిగా పేరు తెచ్చుకున్న బాల‌య్య కోపాన్ని త‌గ్గించుకోవడానికి ఐదు చిట్కాలు చెప్పారు. అవి పాటిస్తే కోపం త‌గ్గడం ఖాయ‌మ‌ట‌.

balakrishna told these 5 tips to control anger

కోపాన్ని త‌గ్గించుకోవ‌డానికి బాల‌య్య ఐదు టిప్స్ చెప్ప‌గా, అందులోమొద‌టిది మాట్లేడేముందు కాస్త ఆలోచించి మాట్లాడాలి. రెండోది కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలంటే కోపం వ‌చ్చిన వెంట‌నే అంకెలు లెక్క‌పెట్టాలి. అంతే కాకుండా కోపం వ‌చ్చిన‌ప్పుడు అర‌వకుండా నెమ్మ‌దిగా మాట్లాడే ప్ర‌య‌త్నం చేయాల‌ని చెప్పాడు. ఇతరుల‌పై కోపం ఉన్నా వారిని క్ష‌మించి మ‌న‌సులో ఉన్న‌ది బ‌య‌ట‌పెట్టాలి. చివ‌ర‌గా బాల‌య్య ఇచ్చిన టిప్ ఏంటంటే కోపాన్ని వీలైనంత త‌గ్గించుకునేందుకు ప్ర‌య‌త్నించాలి. అప్పడే సంతోషంగా ఉంటాం అని బాల‌య్య స్ప‌ష్టం చేశారు.

Admin

Recent Posts