Healthy Payasam : ఇలా చేసుకుని తింటే చాలు.. 100 వ్యాధులు న‌యం అవుతాయి..!

Healthy Payasam : మ‌న‌లో చాలా మంది బ‌ల‌హీన‌త‌, నీర‌సం, ర‌క్త‌హీన‌త, నిద్ర‌లేమి వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. అలాగే కీళ్ల నొప్పులు, జుట్టు రాల‌డం, ఎముక‌లు గుల్ల‌బార‌డం వంటి వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. అలాంటి వారు కింద చెప్పిన విధంగా పాయ‌సాన్ని త‌యారు చేసి తీసుకోవ‌డం వ‌ల్ల నీర‌సం త‌గ్గుతుంది. శ‌రీరం బ‌లంగా, ధృడంగా త‌యార‌వుతుంది. జుట్టు మ‌రియు చ‌ర్మ ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ పాయ‌సాన్ని ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

హెల్తీ పాయ‌సం త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

మీగ‌డ తీసేసిన పాలు – అర లీట‌ర్, ఎండు కొబ్బ‌రి ముక్క – రెండు ఇంచుల ముక్క‌, జీడిప‌ప్పు – 15, బాదంపప్పు – 15, వేయించిన ఫూల్ మ‌ఖ‌నీ – 15, ప‌సుపు – చిటికెడు, గంట పాటు నాన‌బెట్టిన హాలిం సీడ్స్ – 2 టీ స్పూన్స్, చిన్న ముక్క‌లుగా త‌రిగిన ఖ‌ర్జూర పండ్లు – 8, యాల‌కుల పొడి – పావు టీ స్పూన్.

Healthy Payasam recipe in telugu make in this way
Healthy Payasam

హెల్తీ పాయసం త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ముందుగా జార్ లో ఎండు కొబ్బ‌రి ముక్క‌లు, జీడిప‌ప్పు, బాదంప‌ప్పు, ఫూల్ మ‌ఖ‌నీ వేసి బ‌ర‌క‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత క‌ళాయిలో పాలు పోసి ఒక పొంగు వ‌చ్చే వ‌ర‌కు ఉడికించాలి. ఇలాఉడికించిన త‌రువాత ప‌సుపు వేసి క‌ల‌పాలి. ఈ పాల‌ను మ‌రో నిమిషం పాటు మ‌రిగించిన త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న పొడి వేసి క‌ల‌పాలి. దీనిని ఉండలు లేకుండా క‌లుపుకున్న త‌రువాత నాన‌బెట్టుకున్న హాలిం సీడ్స్ ను వేసి క‌ల‌పాలి. ఈ పాయ‌సాన్ని మ‌రో 3 నిమిషాల పాటు ఉడికించిన త‌రువాత ఖ‌ర్జూర పండ్ల ముక్క‌లు, యాల‌కుల పొడి వేసి క‌ల‌పాలి. దీనిని మ‌రో 3 నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి.

ఇలా చేయ‌డం వ‌ల్ల హెల్తీ పాయసం త‌యార‌వుతుంది. దీనిని వేడి వేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది. గ‌ర్భిణీ స్త్రీలు తప్ప దీనిని ఎవ‌రైనా తిన‌వ‌చ్చు. ఈ పాయ‌సాన్ని వారానికి రెండు సార్లు తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. ర‌క్త‌హీన‌త త‌గ్గుతుంది. ఎముక‌లు ధృడంగా త‌యార‌వుతాయి. నీర‌సం ద‌రి చేర‌కుండా ఉంటుంది. శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు అందుతాయి. బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. ఇందులో వాడిన హ‌లిం సీడ్స్ డ్రై ఫ్రూట్ షాపుల్లో, ఆన్ లైన్ లో సుల‌భంగా ల‌భిస్తాయి.

D

Recent Posts