Veg Spring Rolls : రెస్టారెంట్ల‌లో ల‌భించే వెజ్ స్ప్రింగ్ రోల్స్‌.. ఇంట్లోనే ఇలా సుల‌భంగా చేయ‌వ‌చ్చు..

Veg Spring Rolls : మ‌న‌కు రెస్టారెంట్ల‌లో ల‌భించే వాటిల్లో వెజ్ స్ప్రింగ్ రోల్స్ ఒక‌టి. ఇవి రుచిగా, క‌ర‌క‌ర‌లాడుతూ ఉంటాయి. వీటిని చాలా ఇష్టంగా తింటారు. అచ్చం రెస్టారెంట్ల‌లో ల‌బ‌ఙంచే విధంగా ఉండే ఈ స్ప్రింగ్ రోల్స్ ను మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. వీటిని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. రుచిగా క‌ర‌క‌ర‌లాడుతూ ఉండేలా వెజ్ స్ప్రింగ్ రోల్స్ ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

వెజ్ స్ప్రింగ్ రోల్స్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

మైదా పిండి – అర క‌ప్పు, కార్న్ ఫ్లోర్ – పావు క‌ప్పు, ఉప్పు – త‌గినంత‌, నూనె – డీప్ ఫ్రైకు స‌రిప‌డా.

మ‌సాలా మిశ్ర‌మం త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – ఒక టేబుల్ స్పూన్, చిన్న‌గా త‌రిగిన ప‌చ్చిమిర్చి ముక్క‌లు – అర టీ స్పూన్, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ ముక్క‌లు – అర క‌ప్పు, అల్లం వెల్లు్ల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, చిన్న‌గా త‌రిగిన ఫ్రెంచ్ బీన్స్ – పావు క‌ప్పు, చిన్న‌గా త‌రిగిన క్యారెట్ ముక్క‌లు – పావు క‌ప్పు, చిన్న‌గా త‌రిగిన బంగాళాదుంప ముక్క‌లు – అర క‌ప్పు, చిన్న‌గా త‌రిగిన ట‌మాట – 1, చిన్నగా త‌రిగిన క్యాప్సికం ముక్క‌లు – పావు క‌ప్పు, స్వీట్ కార్న్ – పావు క‌ప్పు, ప‌చ్చి బ‌ఠాణీ – పావు క‌ప్పు, ఉప్పు – త‌గినంత‌, కారం – ఒక టీ స్పూన్, ధ‌నియాల పొడి – అర టీ స్పూన్, చాట్ మ‌సాలా పొడి – అర టీ స్పూన్, నీళ్లు – పావు క‌ప్పు, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Veg Spring Rolls make them in restaurant style very easy
Veg Spring Rolls

వెజ్ స్ప్రింగ్ రోల్స్ త‌యారీ విధానం..

ముందుగా ఒక క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక కూర‌గాయ‌ల ముక్క‌లు, ఉప్పు వేసి క‌ల‌పాలి. త‌రువాత మూత పెట్టి ముక్క‌లు మెత్త‌గా అయ్యే వ‌ర‌కు ఉడికించాలి. త‌రువాత కారం, ధ‌నియాల పొడి, చాట్ మ‌సాలా వేసి క‌ల‌పాలి. త‌రువాత నీళ్లు పోసి క‌ల‌పాలి. ఇప్పుడు దీనిని గంటె లేదా స్మాష‌ర్ ను తీసుకుని మెత్త‌గా చేసుకోవాలి. చివ‌ర‌గా కొత్తిమీర చ‌ల్లి స్ట‌వ్ ఆఫ్ చేసుకుని ప‌క్క‌కు పెట్టుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల మ‌సాలా మిశ్ర‌మం త‌యార‌వుతుంది. ఇప్పుడు ఒక గిన్నెలో మైదాపిండి, ఉప్పు, కార్న్ ఫ్లోర్ వేసి క‌ల‌పాలి. త‌రువాత త‌గిన‌న్ని నీళ్లు పోస్తూ దోశ సిండిలా క‌లుపుకోవాలి. త‌రువాత స్ట‌వ్ మీద పెన్నాన్ని ఉంచి వేడి చేయాలి. పెనం వేడ‌య్యాక ముందుగా క‌లిపి పెట్టుకున్న పిండిని కొద్ది ప‌రిమాణంలో తీసుకుని వీలైనంత ప‌లుచ‌గా పూత రేకంత మందంతో వేసుకోవాలి. పిండి కాలి పెనం నుండి వేరవుతున్న‌ప్పుడు తీసి ప్లేట్ లో పెట్టుకోవాలి.

ఇలా అన్ని షీట్ ల‌ను త‌యారు చేసుకున్న త‌రువాత ఇప్పుడు ఒక్కో షీట్ ను తీసుకుని మ‌ధ్య‌లో ముందుగా త‌యారు చేసుకున్న మ‌సాలా మిశ్ర‌మాన్ని ఉంచి స్ప్రింగ్ రోల్స్ ఆకారంలో చుట్టుకోవాలి. ఇలా అన్నింటిని సిద్ధం చేసుకున్న త‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక స్ప్రింగ్ రోల్స్ ను వేసి కాల్చుకోవాలి. వీటిని మ‌ధ్య‌స్థ మంట‌పై ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల క‌ర‌క‌ర‌లాడుతూ రుచిగా రెస్టారెంట్ల‌లో ల‌భించే విధంగా ఉండే స్ప్రింగ్ రోల్స్ త‌యార‌వుతాయి. వీటిని ట‌మాట కిచ‌ప్ తో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. సాయంత్రం స‌మ‌యాల్లో పిల్ల‌ల‌కు ఇలా స్ప్రింగ్ రోల్స్ ను చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారు.

Share
D

Recent Posts