Pressure Cooker Biryani : ప్రెష‌ర్ కుక్క‌ర్ లో బిర్యానీని ఇలా సుల‌భంగా వండ‌వ‌చ్చు..!

Pressure Cooker Biryani : బిర్యానీ అన‌గానే మ‌న‌కు ముందుగా దానికి కావ‌ల్సిన ప‌దార్థాలు.. చేయాల్సిన విధానం అన్నీ గుర్తుకు వ‌స్తాయి. అందుకు త‌గిన పాత్ర ఉండాలి. అలాగే ఎంతో క‌ష్ట‌ప‌డాలి. పాత్రలో అన్నీ వేశాక మూత పెట్టి చుట్టూ గాలి బ‌య‌ట‌కు రాకుండా పిండి పెట్టాలి. ఇలా ఎంతో శ్ర‌మ‌తో బిర్యానీని చేయాల్సి ఉంటుంది. కానీ ఇంత శ్ర‌మ ఎందుకు అనుకునేవారు బిర్యానీని చాలా సుల‌భంగా చేయ‌వచ్చు. అందుకు పెద్ద‌గా క‌ష్ట‌ప‌డాల్సిన ప‌నిలేదు. కింద చెప్పిన విధంగా చేస్తే బిర్యానీని చాలా సుల‌భంగా వండ‌వ‌చ్చు. ఇక బిర్యానీని సుల‌భంగా చేయాలంటే.. దాన్ని కుక్క‌ర్‌లో వండాల్సి ఉంటుంది. అందులో అయితేనే స‌రిగ్గా వ‌స్తుంది. ఇక కుక్క‌ర్‌లో బిర్యానీని ఎలా త‌యారు చేయాలో.. ఇప్పుడు తెలుసుకుందాం.

here it is how you can make Pressure Cooker Biryani
Pressure Cooker Biryani

కుక్క‌ర్ లో చికెన్ బిర్యానీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

చికెన్ – 750 గ్రా., ఉప్పు – త‌గినంత‌, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, కారం – 2 టేబుల్ స్పూన్స్, ధ‌నియాల పొడి – ఒక టేబుల్ స్పూన్, ప‌సుపు – అర టీ స్పూన్, గ‌రం మ‌సాలా – ఒక టేబుల్ స్పూన్, బిర్యానీ మ‌సాలా – ఒక టీ స్పూన్, పెరుగు – 3 టేబుల్ స్పూన్స్.

అన్నం త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

బాస్మ‌తి బియ్యం – మూడు క‌ప్పులు, నూనె – 3 టేబుల్ స్పూన్స్, త‌రిగిన పచ్చి మిర్చి – 4, స‌న్న‌గా పొడుగ్గా త‌రిగిన ఉల్లిపాయ‌లు – 3 (మ‌ధ్య‌స్థంగా ఉన్న‌వి), త‌రిగిన ట‌మాట – ఒక‌టి, త‌రిగిన కొత్తిమీర – అర క‌ప్పు, త‌రిగిన పుదీనా – అర క‌ప్పు, నెయ్యి – 3 టేబుల్ స్పూన్స్, నీళ్లు – 5 క‌ప్పులు.

మ‌సాలా దినుసులు..

సాజీరా – అర టీ స్పూన్, బిర్యానీ ఆకు – ఒకటి, ల‌వంగాలు – 5, యాల‌కులు – 3, దాల్చిన చెక్క – ఒక‌టి, బ్లాక్ స్టోన్ ప్ల‌వ‌ర్ (బిర్యానీ పువ్వు) – కొద్దిగా, జాప‌త్రి – కొద్దిగా, అనాస పువ్వు – ఒక‌టి.

కుక్క‌ర్ లో చికెన్ బిర్యానీ త‌యారీ విధానం..

ముందుగా చికెన్ ను శుభ్రంగా క‌డిగి పైన చెప్పిన ప‌దార్థాల‌న్నింటినీ వేసి క‌లిపి మూత పెట్టి గంట పాటు ప‌క్క‌న‌ ఉంచాలి. త‌రువాత బాస్మ‌తి బియ్యాన్ని క‌డిగి త‌గిన‌న్ని నీళ్లు పోసి అర గంట పాటు నాన‌బెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుక్క‌ర్ లో నూనె వేసి కాగిన త‌రువాత మ‌సాలా దినుసులు వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన త‌రువాత తరిగిన ప‌చ్చి మిర్చి, ఉల్లిపాయ‌లు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ‌లు ఎర్ర‌గా వేగిన త‌రువాత ట‌మాట ముక్క‌ల‌ను వేసి 5నిమిషాల పాటు వేయించాలి. త‌రువాత ముందుగా క‌లిపి పెట్టుకున్న చికెన్ ను వేసి చికెన్ లోని నీళ్లు అంతా పోయి చికెన్ పొడిగా అయ్యే వ‌ర‌కు వేయించాలి. ఇలా వేయించిన త‌రువాత నాన‌బెట్టుకున్న బాస్మ‌తి బియ్యాన్ని, త‌రిగిన కొత్తిమీర‌ను, పుదీనాను, నెయ్యిని వేసి క‌లిపి నీళ్ల‌ను పోసి మూత పెట్టి 2 విజిల్స్ వ‌చ్చే వ‌ర‌కు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించిన త‌రువాత మూత తీసి బిర్యానీ అంత‌టిని మ‌రో సారీ నెమ్మ‌దిగా క‌లుపుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల చాలా సులువుగా, ఎంతో రుచిగా ఉండే చికెన్ బిర్యానీ త‌యార‌వుతుంది. దీనిని సాధార‌ణ బియ్యంతో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఇలా చేసుకున్న బిర్యానీని నేరుగా లేదా రైతాతో క‌లిపి తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది.

D

Recent Posts