business

హోండా నుంచి కొత్త ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌.. 80 కిలోమీట‌ర్ల మైలేజ్‌..

ప్ర‌ముఖ టూవీల‌ర్ త‌యారీ సంస్థ హోండా.. భార‌త్‌లో మ‌రో నూత‌న ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌ను విడుద‌ల చేసింది. క్యూసీ1 పేరిట ఈ స్కూట‌ర్‌ను హోండా లాంచ్ చేసింది. ఇందులో 1.8 కిలోవాట్ల మోటార్, 1.5 కిలోవాట్వ‌ర్ బ్యాట‌రీ ఉన్నాయి. ఈ స్కూట‌ర్‌ను ఫుల్ చార్జింగ్ పెడితే సుమారుగా 80 కిలోమీట‌ర్ల వ‌ర‌కు మైలేజ్ వ‌స్తుంది. దీనికి ఎల్ఈడీ లైట్స్‌, 5 ఇంచుల ఎల్‌సీడీ, 26 లీట‌ర్ల స్టోరేజ్‌, యూఎస్‌బీ టైప్ సి చార్జింగ్ పోర్ట్ వంటి ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. హోండాకు చెందిన యాక్టివా ఇ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌ను ప్రేర‌ణ‌గా తీసుకుని ఈ స్కూట‌ర్‌ను లాంచ్ చేశారు. ముందు భాగం, హ్యాండిల్ బార్‌, సైడ్ ప్యానెల్స్ యాక్టివా ఇ స్కూట‌ర్‌ను పోలి ఉంటాయి. అయితే యాక్టివ్ ఇ కి ఎల్ఈడీ డీఆర్ఎల్‌లు లేవు.

ఇక హోండా క్యూసీ1 ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌లో 1.8 కిలోవాట్ల బీఎల్‌డీసీ మోటార్‌ను ఏర్పాటు చేశారు. అందువ‌ల్ల ఈ స్కూట‌ర్ గంట‌కు గ‌రిష్టంగా 50 కిలోమీట‌ర్ల వేగంతో వెళ్తుంది. ఈ స్కూట‌ర్‌లో రెండు ర‌కాల రైడింగ్ మోడ్స్‌ను అందిస్తున్నారు. ఎకాన‌మీ, స్టాండ‌ర్డ్ అనే మోడ్స్ ఇందులో ఉన్నాయి. స్టాండ‌ర్డ్ మోడ్‌లో 1.5 కిలోవాట్వ‌ర్ బ్యాట‌రీ 80 కిలోమీట‌ర్ల మైలేజ్‌ను ఇస్తుంది. ఇందుకు గాను 4 గంట‌ల 30 నిమిషాల పాటు చార్జింగ్ పెట్టాల్సి ఉంటుంది.

honda qc 1 electric scooter launched

హోండా క్యూసీ1 స్కూట‌ర్‌లో ఎల్ఈడీ లైట్స్‌, 5 ఇంచుల ఎల్‌సీడీ, 26 లీట‌ర్ల స్టోరేజ్ కెపాసిటీ, యూఎస్‌బీ టైప్ సి చార్జింగ్ పోర్ట్‌ను ఇచ్చారు. అలాగే టెలిస్కోపిక్ ఫోర్క్‌, ట్విన్ షాక్ అబ్జార్బ‌ర్‌ల‌ను ఏర్పాటు చేశారు. స్కూట‌ర్ ముందు వీల్ 12 ఇంచులు, వెనుక వీల్ 10 ఇంచుల వెడ‌ల్పును క‌లిగి ఉంటాయి. అయితే ఈ స్కూట‌ర్‌కు గాను హోండా ధ‌ర వివ‌రాల‌ను ఇంకా వెల్ల‌డించ‌లేదు. కానీ జ‌న‌వ‌రిలో ఆ వివ‌రాల‌ను వెల్ల‌డిస్తారు. ఇక ఈ స్కూట‌ర్ అమ్మ‌కాల‌ను సంక్రాంతి త‌రువాతి నుంచి ప్రారంభించ‌నున్నారు.

Admin

Recent Posts